ఆర్బీఐ న్యూ రూల్స్.. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే!

Update: 2021-12-24 01:30 GMT
రాబోయే కొత్త ఏడాదిలో బ్యాంకింగ్ వ్యవస్థలో కొన్ని నియమనిబంధనలు మారనున్నాయి. పేమెంట్స్ కు సంబంధించి ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లావా దేవీలకు సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలను తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయాలతో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇవి అన్నీ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే కొత్త రూల్స్ ద్వారా జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త ఏడాదిలో న్యూ రూల్స్ రావడం షరామామూలే. ఈ సారి ఆన్ లైన్ లావాదేవీలకు సంబంధించిన కొన్ని నియమాలు మారుతున్నాయని ఆర్బీఐ తెలిపింది. మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుండగా వాటితో పాటే ఈ కొత్త నియమాలు అమలు చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

ఈ రూల్స్ అనేవి అమలు లోకి వస్తే కార్డులెస్ చెల్లింపుల విధానం పూర్తిగా మారిపోతుంది. ఈ కొత్త నిబంధనలను పేమెంట్ గేట్ వేలు, ఆన్ లైన్ బిజినెస్ మ్యాన్ ల కోసం తీసుకు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇప్పుడు తీసుకు వస్తున్న తాజా నిర్ణయంతో మీ కార్డుకు సంబంధించిన వివరాలు అనేవి స్టోర్ చేయకుండా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడు అయినా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ-కామర్స్ సంస్థలో షాపింగ్ చేసేటప్పుడు కచ్చితంగా ఇకపై మీ దగ్గర ఉండే 16 అంకెల కార్డ్ నంబర్ ను జ్ఞాపకం ఉంచుకోవాల్సి ఉంటుంది.

లేని పక్షంలో కార్డున మీతో పాటే ఉంచుకోవాల్సి ఉంటుందని నిబంధనలు చెప్తున్నాయి. అయితే ఈ నిబంధనలు ఈ ఏడాది జులై నెలలోనే అమలు లోకి రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్లదానిని పోస్ట్ పోన్ చేశారు. దీంతో ఈ జనవరి ఒకటో తేది నుంచి అమలు చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ భావిస్తుంది.

కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు కొంత ఇబ్బంది ఎదుర్కొవాల్సి ఉంటుంది. అంతేగాకుండా కచ్చితంగా మీ కార్డు నంబర్ ను ప్రతీ లావాదేవీకి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా కార్డుకు సంబంధించిన వివరాలు అనేవి సంబంధిత సైట్ల చేతుల్లో ఉండకుండా ఉంటాయని ఆర్బీఐ చెప్తుంది.

ఇప్పటి వరకు మనం ఒకసారి ఆన్ లైన్ షాపింగ్ చేసినప్పుడు కార్డు వివరాలు ఇస్తే మరలా తిరిగి ఇవ్వకుండా ఉండేది. కారణం సేవ్ కార్డు డీటెల్స్ ఉంటే దానిని అనుసరించి చాలా మంది పేమెంట్స్ చేసేది. కానీ వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి కచ్చింతగా పేమెంట్స్ చేసే ప్రతీ సారి కార్డు నంబర్ ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఇప్పటికే చాలా సైట్లు యూజర్ల కార్డుల వివరాలను స్టోర్ చేశాయి. వాటి నుంచి ఎలాంటి ప్రభావం వినియోగదార్లపై పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News