ఫోటో : కొత్త 200 నోటు రావ‌డ‌మే ఆల‌స్యం

Update: 2017-04-06 10:26 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత జ‌రుగుతున్న కీల‌క ప‌రిణామాల్లో మ‌రో అడుగు ప‌డింది. నోట్ల కొరతను దృష్టిలో పెట్టుకుని.. కొత్తగా రెండు వందల రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్ర‌య‌త్నిస్తోంది. కేంద్రం ఆమోద ముద్రవేస్తే.. అతి త్వరలో నోట్ల ప్రింటింగ్ ను ప్రారంభిస్తామని ఆర్‌బీఐ అధికారులు తెలిపారు. కాగా, కొత్త 200 రూపాయ‌ల నోటు ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో ఓ ఫొటో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది.

నోట్ల రద్దు అనంతరం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా... అవి అనుకున్నంత మేరకు లేకపోవడం, చిన్న నోట్ల కొరత కొనసాగుతుండడంతో రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 2017, జూన్ తర్వాత నుంచి వీటి ముద్రణ ప్రారంభం కానుందని రిజర్వ్ బ్యాంక్ అధికారుల సమాచారం. మార్చి నెలలో జరిగిన డైరెక్టర్ల బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు.మార్చి నెలలో ఆర్‌బీఐ క్షేత్ర‌స్థాయి అధ్య‌యనం చేసింది.

కాగా, 10 రూపాయల నోటును ప్లాస్టిక్ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం. అధికారికంగా మాత్రం వీటిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు రిజర్వ్ బ్యాంక్. రూ.200 నోటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 2వేల నోటు రద్దవుతుందా అనే విషయంపైనా ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News