రూపాయి నోట్ల‌ను రిలీజ్ చేసేశారు?

Update: 2017-11-29 09:57 GMT
కొన్ని నిర్ణ‌యాలు ఎందుకు తీసుకుంటారో అస్స‌లు అర్థం కాదు.  అవ‌స‌రం లేకున్నా తీసుకునే ఈ త‌ర‌హా నిర్ణ‌యాల కార‌ణంగా లేనిపోని ఆర్థిక భారం త‌ప్పించి మ‌రెలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. తాజాగా రిజ‌ర్వ్ బ్యాంక్ తీరు చూస్తే ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు.

ఈ మ‌ధ్య‌న కొత్త‌గా విడుద‌ల చేసిన యాభై.. రెండు వంద‌ల నోట్లు ఇంత‌వ‌ర‌కూ మార్కెట్లోకి వ‌చ్చింది లేదు. అర‌కొర‌గా విడుద‌ల చేసిన ఈ నోట్ల మీద ఉన్న క్రేజ్ తో మార్కెట్లోకి తెచ్చిన నోట్లు ఎవ‌రికి వారు త‌మ త‌మ ప‌ర్సుల్లో ఉంచేసుకుంటున్నారు. దీంతో విడుద‌ల కాసిన్ని నోట్లు కొంద‌రికే ప‌రిమితం అవుతున్నాయి.

మార్కెట్లో ఉన్న నోట్ల కొర‌త‌ను త‌గ్గించేందుకు భారీ ఎత్తున క‌స‌రత్తు చేయాల్సిన రిజ‌ర్వ్ బ్యాంక్ తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించింది.

ఒక‌వైపు చిల్ల‌ర‌నోట్ల‌కు మ‌హా ఇబ్బంది ప‌డుతుంటే.. అందుకు భిన్నంగా రూపాయి  నోట్ల‌ను విడుద‌ల చేయ‌టం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. అన్ని బ్యాంకుల‌కు కాకుండా రూపాయి నోట్ల‌ను స్టేట్ బ్యాంకుల‌కు ఉన్న‌తాధికారులు పంపిస్తున్నారు.   దీంతో కొన్ని బ్యాంకుల్లో రూపాయి నోట్ల క‌ట్ట‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇవాల్టి రోజున రూపాయి నోటుకు వ‌చ్చేదేమీ లేదు. కానీ.. రూపాయి నోట‌ను విడుద‌ల చేయ‌టం ఆశ్చ‌ర్యం.

ఓర‌కంగా చూస్తే.. రూపాయి విలువ‌తో పోలిస్తే.. దాని ప్రింటింగ్‌కు అయ్యే ఖ‌ర్చు అధికంగా ఉంటుంది. ఓప‌క్క రూ.200.. రూ.100.. రూ.50 నోట్ల కొర‌త‌ను ఎదుర్కొంటున్న ప‌రిస్థితి. కొర‌త తీర్చాల్సిన అవ‌స‌రాన్ని వ‌దిలేసి అన‌వ‌స‌ర‌మైన వాటిని విడుద‌ల చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీలోని కొన్ని జిల్లాల‌కు రూపాయి నోట్లను స్థానిక స్టేట్ బ్యాంక్ ఇండియా బ్యాంకుల్లో ఇస్తున్నారు. వీటిని స‌ర‌దాగా తీసుకొని దాచుకోవ‌టం మిన‌హా దేనికి ప‌నికి రావ‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News