రూ.500 నోట్లపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. అందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే షాక్ తినాల్సిందే. అప్రయత్నంగా ప్రధాని మోడీ గుర్తుకు రావటం ఖాయం. ఎందుకంటే.. అందులో వెల్లడించిన అంశాలు అలా ఉంటాయి మరి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. యావత్ దేశంతో పాటు.. ప్రపంచ దేశాలు సైతం ఒక్కసారి విస్మయానికి గురయ్యే సంచలన నిర్ణయాన్ని మోడీ తీసుకోవటం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు అంటూ ఆయన చేసిన ప్రకటన ప్రకంపనలు అంతా ఇంతా కాదు.
సామాన్యుడు మొదలు సంపన్నుడు వరకు అందరూ కరెన్సీ నోట్ల కోసం కటకటలాడే పరిస్థితి. నల్లధనానికి చెక్ చెప్పటంతో పాటు.. ఫేక్ కరెన్సీ నోట్లపై సాగే యుద్ధంలో భాగంగా తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. అంటే.. పాత నోట్లను రద్దు చేసి.. కొత్త నోట్లను తీసుకొస్తే నకిలీ కరెన్సీ మాటే ఉండదని.. అలాంటి అవకాశం లేకుండా కొత్త నోట్లను తయారీ ఉంటుందన్న మాట వినిపించింది. కొత్త కరెన్సీనోట్లను పోలి ఉండేలా తయారు చేయటం కష్టమన్న మాట చెప్పారు.
పెద్దనోట్ల రద్దు కారణంగా.. బ్యాంకుల ఎదుట పెద్ద ఎత్తున క్యూ లైన్లు బారులు తీరటమేకాదు.. గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యావత్ దేశ ప్రజలు ఇంత కష్టానికి గురి చేసిన పెద్ద నోట్ల రద్దు కారణంగా..ఒనగూరిన ప్రయోజనం పెద్దగా లేదన్న విషయం తాజాగా విడుదలైన ఆర్ బీఐ నివేదిక చెప్పకనే చెప్పేస్తోంది. కొత్త కరెన్సీని తీసుకొచ్చిన తర్వాత కూడా వ్యవస్థలోకి నకిలీలు పెరిగిపోతున్నట్లుగా నివేదిక వెల్లడించి షాకిచ్చింది.
రిజర్వు బ్యాంకు తాజా నివేదికలో దొంగ రూ.500 నోట్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు్గా పేర్కొంది. 2020-21 ేడాదిలో రూ.500 నోట్లలో ఫేక్ కరెన్సీ ఏకంగా 31.4 శాతం మేర పెరిగినట్లుగా ఆర్ బీఐ గుర్తించింది. అయితే.. ఇతర కరెన్సీ నోట్లలో నకిలీ నోట్లు తగ్గినట్లుగా చెప్పింది. గత ఏడాదిలో (2020-21) 39,453 నకిలీ రూ.500నోట్లను గుర్తించింది. అదే సమయంలో 1.11 లక్షల నకిలీ రూ.100నోట్లను గుర్తించారు. అయితే.. 2019లో పోలిస్తే కాస్త తక్కువగా ఉన్నా.. 2020లో ఉన్న లాక్ డౌన్ కారణంగా ఈ నకిలీ యాపారం కాస్త తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త నోట్లతో నకిలీ తయారు చేయటం సాధ్యం కాదన్న మోడీజీ ఇప్పుడేమంటారు?