చలామణీలోకి ఏ నోటు వచ్చినా దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ ఆర్ బీఐ దగ్గర ఉంటాయి. కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.33 కోట్ల విలువైన నోట్లకు కనీసం ఆర్ బీఐ దగ్గర ఎటువంటి వివరాలు లేవంట!! నల్లధనాన్ని పూర్తిగా తరమికొట్టేందుకు ప్రధాని మోదీ పెద్దనోట్లను రద్దు చేశారు. దీని తర్వాత సామాన్యులు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. కొత్త రూ.2000 - రూ.500 నోట్ల కోసం ఏటీఎంల ముందు క్యూ కట్టారు. కానీ కొందరి ఇళ్లకు మాత్రం కొత్త నోట్లు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో శేఖర్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఐటీ అధికారులు నివ్వెరబోయారు. ఒకే సీరియల్ తో ఏకంగా రూ.33 కోట్లు ఎలా వచ్చాయో తెలియక బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. ఇప్పుడు వీటికి సంబంధించిన వివరాలు ఆర్ బీఐకి కూడా తెలియలేకపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది!
నోట్ల రద్దు.. దేశాన్ని ఎంతలా కుదిపేసిందో తెలిసిన విషయమే! పెద్ద నోట్లు రద్దయిన తరువాత చాలా మంది బడా బాబుల వద్దకు రూ.2000 - రూ.500 నోట్లు అక్రమ మార్గంలో బ్యాంకుల ద్వారా వెళ్లిపోయాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో.. ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. డిసెంబరు 8న చేసిన దాడుల్లో భాగంగా ఎస్ ఆర్ ఎస్ కంపెనీ పేరున తమిళనాడు వ్యాప్తంగా ఇసుక క్వారీలు నడిపే కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇళ్లు - కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఏకంగా రూ.33.6 కోట్ల కొత్త నోట్లు చూసిన అధికారులకు దిమ్మతిరిపోయినంత పనయింది. కేసు తీవ్రత దృష్ట్యా విచారణ బాధ్యతను సీబీఐ చేపట్టింది. మరి ఇవన్నీ ఎలా వచ్చాయని శేఖర్ రెడ్డిని విచారించినా ఆధారాలు రాబట్టలేకపోయారు.
ఒకే సీరియల్ లో రూ.33.6 కోట్ల కొత్త కరెన్సీ శేఖర్ రెడ్డికి ఎలా లభించిందని ఆర్ బీఐని సీబీఐ ప్రశ్నించింది. కరెన్సీని ముద్రించే నాసిక్ - మైసూర్ తదితర ప్రాంతాల నుంచి తమకు కొత్త నోట్లు చేరుతాయి.. వాటిని యథాతథంగా బ్యాంకులకు పంపుతాం.. సీరియల్ నంబర్లను రికార్డుల్లో నమోదు చేసే అలవాటు లేదు అని ఆర్ బీఐ అధికారులు బదులిచ్చారు. రూ.33.6 కోట్ల కొత్త కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందో వివరాలు ఇవ్వలేమని ఆర్ బీఐ అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఇప్పుడు ఈ కేసులో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో అరెస్టు చేసిన 90 రోజుల్లో శేఖర్ రెడ్డిపై చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉన్నా కీలకమైన ఆధారాలు దొరక్కపోవడంతో వెనుకాడుతున్నారు!!
రూ.33.6 కోట్ల కొత్త కరెన్సీ గురించి బ్యాంకులు - రిజర్వు బ్యాంకు వద్ద విచారణ కొనసాగుతున్నందున నిర్ణీత కాలంలో చార్జిషీటు దాఖలు చేయలేకపోయామని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి చెప్పుకున్నారు. దీంతో శేఖర్ రెడ్డి తదితరులకు బెయిల్ మంజూరైంది. పట్టుబడిన నగదు - బంగారానికి పన్ను చెల్లించామని - 2016–17 - 2017–18 ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్సుగా రూ.31 కోట్లు చెల్లించామని - ఇదంతా నిబంధనలకు లోబడి వ్యాపారం ద్వారా ఆర్జించినదేనని శేఖర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదిస్తున్నారు. మరి చివరకు ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందో!!