ఆర్సీబీ అభిమానులకి ఐపీఎల్ కప్ కొట్టాలనే కల మరోసారి నిరాశగానే మిగిలిపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ కోల్ కత్తా తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూర్ జట్టులో కోహ్లీ(39) రాణించడంతో నిర్ణిత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఇక అనంతరం 139 పరుగుల టార్గెట్ తో వచ్చిన కేకేఆర్ జట్టు లక్ష్య చేధనను బాగానే ఆరంభించింది. అయితే నెమ్మదిగా వెళ్తున్న కేకేఆర్ ఛేదనలో సునీల్ నరైన్ వేగం పెంచాడు. అతను బ్యాటింగ్ కు వచ్చిన 12వ ఓవర్ లో మూడు సిక్సులు సహాయంతో 22 పరుగులు సాధించాడు. దాంతో మ్యాచ్ కేకేఆర్ వైపుకు తిరిగింది. ఇక అనంతరం సాధించాల్సిన పరుగులు తక్కువే ఉండటంతో నెమ్మదిగా ఆడుతూ చివరి ఓవర్ లో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది కేకేఆర్. దాంతో క్వాలిఫైర్ 2 లోకి నైట్ రైడర్స్ ప్రవేశించారు.
ఇక గత ఏడాది ఐపీఎల్ లో ఎలిమినేటర్ దశలో వెనుదిరిగిన బెంగళూర్ ఇప్పుడు అదే స్థానం నుండి వెనకకు వచ్చేసింది. ఎంతో కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. మైదానంలోనే కోహ్లీ, డివిలియర్స్ కన్నీళ్లు పెట్టుకోవడం ఆర్సీబీ అభిమానులనే కాదు. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కలచి వేసింది. ఈసారి కూడా కప్ కొట్టకపోవడంపై కొందరు అభిమానులు బాధతో ఉంటే.. మరికొందరు టీమ్‌పై సోషల్ మీడియా వేదికగా దుర్భాషలాడుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే .. డాన్ క్రిస్టియన్ వేసిన ఒక ఓవర్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 22 పరుగులు సాధించారు. ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం మారిపోయింది. సునీల్ నరైన్ ఆ ఓవర్లో ఏకంగా 3 సిక్కులు బాదాడు. ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ తమ కోపాన్ని క్రిస్టియన్ పై వెళ్లగక్కుతున్నారు. అంతే కాదు అతని భార్యకు సైతం సోషల్ మీడియా తిడుతూ సందేశాలు పంపుతున్నారు. దానిపై క్రిస్టియన్ స్పందించాడు. 'నా భార్య ఇన్ స్టా పోస్టు కామెంట్ సెక్షన్ ను చూడండి. ఈ గేమ్ మేము బాగా ఆడలేకపోయాం. అది ఆట మాత్రమే. ఏదేమైనా.. నా భార్యను ఇందులోకి లాగకండి' అంటూ క్రిస్టియన్ ఇన్ స్టా స్టోరీ పోస్ట్ చేశాడు.
మ్యాచ్ ఓటమి తర్వాత మ్యాక్స్‌వెల్‌కి కూడా సోషల్ మీడియాలో తిడుతూ కామెంట్లు వచ్చాయి. నీ వల్లే మ్యాచ్ ఓడిపోయాం అంటూ తిట్ల దండకం అందుకున్నారు. అది చూసిన గ్లెన్ మ్యాక్స్ వెల్ కు కోపం వచ్చింది. వారి కామెంట్లపై స్పందించాడు. ఆర్సీబీ గొప్ప సీజన్ ఇంది. మేము అనుకున్న దానికంటే ముందే తప్పుకోవాల్సి వచ్చింది. కొందరు సోషల్ మీడియాలో పిచ్చిగా వాగుతున్నారు. మేము మనుషులుగా ప్రతిరోజు మా బెస్ట్ ఇస్తున్నాం. ఇలా తిట్టడం మాని మంచి మనుషులుగా ఉండండి. మొదటి నుంచి నిజంగా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్న అభిమానులు అందరికీ ధన్యవాదాలు అంటూ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ట్వీట్ చేశాడు. ఎలా పడితే అలా మాట్లాడితే సహించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.