పంజాబ్ కు వెళ్లి గురుదాస్ పూర్ నుంచి ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేసిన సన్నీడియోల్ పై ధ్వజమెత్తారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. సన్నీ డియోల్ కు గెలిచే అవకాశాలు లేవని, గురుదాస్ పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కచ్చితంగా విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేసిన అమరీందర్ సింగ్ ఆ హీరోపై గట్టిగా మాట్లాడారు. సన్నీడియోల్ కు దేశం గురించి ఏం అవగాహన ఉంది? అంటూ అమరీందర్ ధ్వజమెత్తారు,
'ఇటీవలే నేను అతడి ఇంటర్వ్యూ ఒకటి టీవీలో చూశా.. అతడితో బాగల్ కోల్ ఘటన గురించి టీవీ వాళ్లు అడిగారు. అతడు దానిపై స్పందించలేకపోయాడు. ఏ రోజు అయినా పేపర్ చదివి, వార్తలు వినేవారికి అయితే అలాంటివి తెలుస్తాయి...' అంటూ అమరీందర్ అన్నారు.
అంతే కాదు..'ఎంపీగా గెలిస్తే సన్నీ డియోల్ ముంబై వెళ్లిపోతాడు..' అంటూ గురుదాస్ పూర్ ప్రజలను హెచ్చరించాడు కెప్టెన్ అమరీందర్ సింగ్. 'అతడి ఇళ్లు ముంబైలో ఉంది. అతడి భూములు ముంబైలో ఉన్నాయి. అతడి వృత్తి ముంబైలో చేస్తాడు. అలాంటి వ్యక్తిని గురుదాస్ పూర్ నుంచి ఎంపీగా గెలిపిస్తే ఇక్కడెందుకు ఉంటాడు? పంజాబ్ లో ఉండనే ఉండడు. అతడు ముంబైకి వెళ్లిపోతాడు..' అంటూ ఆ బాలీవుడ్ హీరోపై అమరీందర్ సింగ్ స్థానికత ను సెంటిమెంట్ గా ఉపయోగించాడు.
సన్నీడియోల్ తండ్రి ధర్మేంద్ర పంజాబీ జాట్. ఆ సెంటిమెంట్ ను ఉపయోగించుకుంటూ బీజేపీ వాళ్లు సన్నీడియోల్ ను అక్కడ నుంచి పోటీ చేయించారు. ఈ నేపథ్యంలో పంజాబీ కాంగ్రెస్ నేతలు సన్నీపై ఇలా ఫైర్ అవుతున్నారు.