ఆ రాష్ట్రం లోని ఆ ప్రాంతం లో అంతా ద్రౌపతీలేనట

Update: 2020-01-24 04:46 GMT
అసలు జరిగిందో లేదో అన్న దానికి శాస్త్రీయత లేనప్పటికీ.. చారిత్రక  గ్రంధంగా కొందరు.. పురాణ గాథగా మరికొందరు చెప్పే మహాభారతంలో ద్రౌపతి పాత్ర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ఒక భర్తకు చాలామంది భార్యలన్న కాన్సెప్ట్ కు భిన్నంగా.. ఐదుగురు దిగ్గజ పాండవులకు ఒకే భార్యగా ద్రౌపతీ  సుపరిచితురాలు. ద్రౌపది పేరు విన్నంతనే గుర్తుకు వచ్చేది ఆమెకు ఐదుగురు భర్తలని. ఈ కారణం తోనే కావొచ్చు.. ద్రౌపతి పేరును తమ కుమార్తె కు పెట్టుకోవటానికి ఏ తల్లిదండ్రులు ముందుకు రారు.

పేరు పెట్టేందుకే ససేమిరా అనుకునే వేళ.. ద్రౌపతి మాదిరి ఒక ఇంట్లో ఉన్న అన్నదమ్ములకు ఒకే భార్య అనే కాన్సెప్ట్ ను వినేందుకే మనసు అంగీకరించరు. కానీ.. నేటికి ఒక తెగ వారు మహా భారతం లో ద్రౌపతి మాదిరి ఒకే ఇంట్లోని అన్నదమ్ముల్ని ఒకే అమ్మాయి పెళ్లాడి.. వారితో జీవనం సాగించాల్సి ఉంటుంది.

అప్పుడెప్పుడో తాతల కాలం క్రితం ఈ రూల్ ను ఆ తెగలోకి తీసుకొస్తే.. నేటి డిజిటల్ యుగంలోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. వినేందుకు విచిత్రంగా అనిపించినా.. ఇది నిజమని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని శివారు ప్రాంతాల్లో నివసించే కొన్ని తెగల కుటుంబాల్లో ద్రౌపతి మాదిరే.. ఒక మహిళ ను ఒకే ఇంటికి చెందిన అన్నదమ్ములంతా కలిసి ఒక అమ్మాయినే పెళ్లాడతారట.

అయితే.. ఈ విధానం ఇప్పటికి అమలు కావటానికి కారణం.. అప్పుడెప్పుడో తాతల నాటి రూల్ కంటే కూడా.. ఆ ప్రాంతంలోని ప్రజలంతా వ్యవసాయ భూమి మీద ఆధారపడి బతకటం.. ఒక్కొక్కరు ఒక్కో అమ్మాయిని పెళ్లాడితే.. కుటుంబ పోషణ కష్టంగా మారుతుందన్న ఉద్దేశంతోనే ఈ విధానాన్ని నేటికి అమలు చేస్తారని చెబుతున్నారు. వినేందుకే ఇబ్బంది గా ఉన్న ఈ విధానాన్ని నేటికీ ఓకే అంటున్న ఆ మహిళల కష్టం మరెంతగా ఉంటుందన్న ఊహ కూడా భయంకరమని చెప్పక తప్పదు.


Tags:    

Similar News