మూడో వేవ్ మరణాల్లో అత్యధికం.. ఆ కారణం వల్లనేనట

Update: 2022-01-23 05:41 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న మూడో వేవ్  భారత్ ను తెగ ఇబ్బందికి గురి చేస్తోంది. అయితే.. మొదటి.. రెండో వేవ్ లతో పోలిస్తే మూడో వేవ్ తీవ్రత తక్కువగా ఉండటం.. రోగ లక్షణాలు ఆసుపత్రుల్లో చేరాల్సినంతగా లేకపోవటం తెలిసిందే. దీంతో.. ఎవరికి వారు హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ కారణంగానే.. కేసుల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ.. గత రెండు వేవ్ లలో కనిపించిన భయానక సీన్లు కనిపించటం లేదు. వైద్యం కోసం ఆసుపత్రుల ముందు అంబులెన్సులు బారులు తీరటం.. వైద్యం అందక.. ఆసుపత్రి ఆవరణలోనే మరణించటం లాంటివి జరగటం లేదు.

మరో కీలకమైన అంశం ఏమంటే.. మొదటి రెండు వేవ్ లతో పోలిస్తే.. మూడో వేవ్ లో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండటం కూడా ఊరట కలిగించే అంశంగా చెప్పాలి. మూడో వేవ్ లో మరణించిన వారిలో 60 శాతం మంది టీకా వేసుకోని వారు లేదంటే ఒక్క డోసు మాత్రమే వేసుకున్న వారన్న కొత్త విషయాన్ని మాక్స్ హెల్త్ కేర్ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. మరణించిన వారిలో అత్యధికులు 70 ఏళ్లకు పైబడిన వారన్న విషయాన్ని పేర్కొన్నారు.

మూడో వేవ్ లో మరణించిన వారిలో కరోనాతో పాటు.. కిడ్నీ.. గుండె సమస్యలతో పాటు షుగర్.. క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధ పడుతున్న వారుగా సదరు అధ్యయనం వెల్లడించింది. మాక్స్ హెల్త్ కేర్ ఆసుపత్రుల యాజమాన్యం నరి్వహించిన తాజా అధ్యయనంలో పేర్కొన్న అంశాల్ని చూస్తే..

-  థర్డ్ వేవ్ లో మరణించిన మా ఆసుపత్రుల్లో 82 మంది మరణించారు. వీరిలో 60 శాతం మంది మొదటి డోసు మాత్రమే తీసుకున్న వారు లేదంటే.. అసలు టీకానే తీసుకోని వారు.
-  టీకాలు తీసుకోవటం కారణంగా మూడో వేవ్ లో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.
-  ఒమిక్రాన్ తీవ్రత.. లక్షణాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి.
-  మూడో వేవ్ లో ఆసుపత్రిలో చేరిన వారిలో 23.4 శాతం మంది మాత్రమే ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందారు.
- రెండో వేవ్ లో ఆక్సిజన్ వినియోగం 74 శాతంగా ఉండేది. మొదటి దశలో 63 శాతంగా ఉంది.
-  మొదటి వేవ్ లో తమ ఆసుపత్రుల్లో మొదటి వేవ్ లో 12,444మంది చేరితే.. రెండో వేవ్ లో 20,883 మంది చేరారని.. మూడో వేవ్ లో 1378 మాత్రమే చేరినట్లు వెల్లడించారు. మొదటి వేవ్ లో కరోనా బారిన పడి.. ఆసుపత్రిలో చేరి షెడ్యూల్ టైంలో డిశ్చార్జి అయ్యేవారని.. కానీ రెండో వేవ్ లో మాత్రం అందుకు భిన్నంగా దీర్ఘకాలం చికిత్సను అందించాల్సి వచ్చేదని పేర్కొన్నారు.
Tags:    

Similar News