విద్యుత్ సంక్షోభం అన్నది తలెత్తకుండా గతంలో తీసుకున్నచర్యలు ఫలించాయి పూర్తి స్థాయిలో అయితే సఫలీకృతం కాలేదు అనేందుకు రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాలే నిదర్శనం. విద్యుత్ ఉత్పత్తి అన్నది అవసరాలకు అనుగుణంగా లేనందునే కోతలు అనివార్యం అవుతున్నాయన్న విషయాన్ని సంబంధిత అధికారులు నిర్థారిస్తున్నారు.ఇదివరకూ ఇలాంటి సమస్యలే ఉత్పన్నం అయితే అప్పట్లో సమృద్ధిగా వర్షాలు పడడంతో జలవిద్యుత్ ఆదుకుంది.అప్పుడు కూడా థర్మల్ విద్యుత్ సంబంధించే సమస్యలు చుట్టుముట్టాయి.
ఆఖరిని నిమిషంలో రాష్ట్రాలకు బొగ్గు ఉత్పత్తి చేసి పవర్ ప్లాంట్లు అన్నవి అర్ధంతరంగా ఆగిపోకుండా కేంద్రం కూడా చొరవ చూపడం,ఆ రోజు బొగ్గు కొనుగోలుకు సంబంధించి అదానీ గ్రూపు సంస్థల విషయమై ప్రభుత్వం మొగ్గు చూపడం ఇవన్నీ కారణంగా సమస్య అయితే అప్పటికప్పుడు సాల్వ్ అయింది. కానీ ఇప్పుడు ఎన్టీపీసీకి డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించని కారణంగా మూడు వందల కోట్లకు పైగా డిస్కంలు బకాయి పడ్డ కారణంగా విద్యుత్ సరఫరా అన్నది ఆశించినంతగా లేదు.డిస్కంలను అప్రమత్తం చేస్తూ ఎన్టీపీసీ లేఖలు రాస్తున్నా కూడా సంబంధిత వర్గాలు స్పందించని కారణంగానే ఈ సమస్య తలెత్తిందని స్పష్టం అవుతోంది.దీంతో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. తత్ఫలితంగా విద్యుత్ కోతలు అనివార్యం అయ్యాయి.
మూడు వందల కోట్లకు పైగా ఉన్న అప్పుకు ముప్పై కోట్ల రూపాయలు అయినా తీర్చకుంటే తాము విద్యుత్ సరఫరాను చేయలేమని ఎన్టీపీసీ తేల్చేసింది. దీంతో తగాదాను పరిష్కరించేందుకు సీన్ లోకి ముఖ్యమంత్రి రానున్నారు.మరోవైపు సమస్యను అధిగమించేందుకు కృష్ణపట్నం, వీటీపీఎస్ (విజయవాడ) థర్మల్ విద్యుత్ కేంద్రాలను సంప్రదించినప్పటికీ అక్కడ కూడా బాయిలర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో శనివారం ఉదయం నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.మరోవైపు పరిమితికి మించి విద్యుత్ ను తీసుకుంటున్నారని,ఈ విధంగా చేస్తే జాతీయ గ్రిడ్ కే ప్రమాదం అని ఏపీని ఉద్దేశించి సంబంధిత వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఈ మేరకు పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ రంగంలోకి దిగి రాష్ట్ర విద్యుత్ సంస్థలకు లేఖాస్త్రాలు సంధించింది.ఇప్పటికే విద్యుత్ పొదుపులో రాష్ట్రం ఆశించిన ప్రగతిలో లేనందున ఉత్పత్తికీ, సరఫరాకూ మధ్య భేదం,అదేవిధంగా ఉత్పత్తికీ,వాడకానికీ మధ్య వ్యత్యాసం అన్నవి ఎక్కువగానే ఉంటున్నాయి.ఈ కారణంగానే కోతలు తప్పడం లేదు.కొన్ని గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిమాండ్ 170 మిలియన్ యూనిట్లు (170.542మిలియన్ యూనిట్లు) పైగా ఉండగా నిన్న ఒక్కరోజే (శుక్రవారం) వ్యవసాయ,పారిశ్రామిక రంగాలకు కోత విధించినా 24మిలియన్ యూనిట్ల మేరకే డిమాండ్ తగ్గిందన్న సమాచారం అందుతోంది.
అంతేకాదు పీక్ అవర్స్ లో కూడా కోతలు విధించి కాస్తోకూస్తో గ్రామీణ వాతావరణంను ఆందోళనలోకి నెట్టాయి విద్యుత్ సంస్థలు. ఈ నేపథ్యంలో జాతీయ గ్రిడ్ పై ఆధారపడి ఈ నెల 3,4 తేదీలలో పరిమితికి మించి 1565 మెగా యూనిట్లు, 1485మెగా యూనిట్లు చొప్పున ఎక్కువ తీసుకున్నా కూడా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. అయినా కూడా కోతలు అనివార్యం అయ్యాయి.ఇదే సమయంలో విద్యుత్ సమస్యపై అప్పుడే సరఫరాలో తలెత్తుతున్న అంతరాయంపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కనుక నష్ట నివారణ చర్యలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలి. అందాక జల విద్యుత్ పై ఆధారపడినా కూడా థర్మల్ విద్యుత్ అన్నదే కీలకం. రాష్ట్రంలో అందుకు తగ్గ బొగ్గు నిల్వలు కూడా లేవు.
ఈ దశలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ను పునరుద్ధరించినా, బొగ్గు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే 1300 మెగా యూనిట్లు ఇచ్చే ఆ రెండు (కృష్ణపట్నం,విజయవాడ వీటీపీఎస్) తమ సామర్థ్యం మేరకు పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.ఓ వైపు జాతీయ గ్రిడ్ ని ప్రమాదంలో నెట్టవద్దని హెచ్చరికలు మరోవైపు బొగ్గు నిల్వలు లేని వేళ సంబంధిత యూనిట్లు మూతపడే అవకాశం ఉందన్న భయాందోళనలు చుట్టుముడుతున్న తరుణాన వీలున్నంత మేర విద్యుత్ పొదుపు పై వినియోగదారులు దృష్టి సారిస్తే మేలు అన్నది నిపుణుల మాట.