బీహార్ ఎన్నికల ఫలితాలు షాకింగ్ గా మారాయి. బీహార్ లో బీజేపీ గెలుస్తుందని నమ్మకంగా ఎవరూ చెప్పకున్నా.. మరీ ఇంత దారుణంగా ఓటమిపాలు అవుతారని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఎగ్జిట్ పోల్స్ సైతం.. ఎన్డీయే.. మహా కూటమి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంటుందని మాత్రమే అంచనా వేశారు. కానీ.. అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ ఎలాంటి మొహామాటాల్లేకుండా చాలా స్పష్టమైన తీర్పును బీహారీలు ఇచ్చేశారు. తమ తీర్పుతో దేశ ప్రజలకు బీహారీలు సరికొత్త సందేశాన్ని ఇచ్చారు. నిరక్షరాస్యత.. వెనుకబాటుతనానికి కేరాఫ్ అడ్రస్ గా భావిస్తూ.. బీహారీల్ని తక్కువగా అంచనా వేయటం కనిపిస్తుంది. తాజాగా ఇచ్చిన విస్పష్ట తీర్పుతో.. తామెంత చైతన్యవంతులమన్న విషయాన్ని బీహారీలు ఓటుతో చెప్పేశారు.
ఎవరూ ఊహించనంత దారుణ ఓటమి బీజేపీకి ఎందుకు ఎదురైంది? దీనికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నలు చూస్తే.. కారణాలు ఇవేనని చెప్పక తప్పదు.
= మూడు ప్రధాన పార్టీలైన జేడీయూ..ఆర్జేడీ.. కాంగ్రెస్ లు ఒక జట్టుగా మారటం.. వీరికి చెందిన ఓటు బ్యాంక్ భద్రంగా బ్యాలెట్లోకి చేర్చేలా చేయటంలో మహా కూటమి విజయం సాధించటం.
= ముఖ్యమంత్రి నితీశ్ మీద వ్యక్తిగతంగా బీహారీలకు ఎలాంటి అసంతృప్తి లేకపోవటం.
= బీహార్ ఎన్నికల పోరు నితీశ్ కు.. మోడీకి మధ్య ముఖాముఖి పోరుగా మారటం.
= లౌకిక కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ అని స్పష్టంగా ప్రకటిస్తే.. ఎన్డీయే తమ సీఎం అభ్యర్థి విషయంలో తేల్చకపోవటం.
= బీహార్ ఎన్నికల ప్రచారంలో మోడీ.. అమిత్ షా బొమ్మలతో పోస్టర్లు వేశారే కానీ.. బీహారీ నేతల్ని పట్టించుకోకపోవటం.. స్థానిక నాయకత్వం మీద బీహారీల సందేహాలకు పార్టీ సమాధానం సంతృప్తిని ఇవ్వకపోవటం.
= ఢిల్లీ వర్సెస్ బీహార్ గా ఎన్నికల్ని మార్చటంలో మహా కూటమి విజయం సాధించటం.
= పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు.. మత అసహనం మీద అనవసర రచ్చ. పప్పుల ధరలు కిలో రూ.200కు చేరటాన్ని ప్రస్తావిస్తూ ‘‘మంచిరోజులు అంటే ఇదేనా?’’ అని మోడీ మీద సాగించిన ప్రచారం
= బీజేపీ అభ్యర్థుల ఎంపికలో కొందరు నేతల మాటనే అధినాయకత్వం వినటం.
= రిజర్వేషన్లను సమీక్షించాల్సిన అవసరం ఉందన్న ఆర్ఎస్ ఎస్ అధినపతి మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్య.
= బీహార్ లో 14 శాతం మాత్రమే ఉండే అగ్రవర్ణాలకు మొత్తం టిక్కెట్లలో 40 శాతం ఇవ్వటం.