ఢిల్లీకి చేరిన బాబు 'కత్తి' రాజకీయం..

Update: 2018-10-27 07:53 GMT
దేశంలోనే ఏ రాష్ట్ర నేతలతోనైనా పెట్టుకోండి ఫర్వాలేదు.. కానీ ఏపీ నేతలతో మాత్రం పెట్టుకోవద్దు బాబోయ్ అని ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్లు వ్యాఖ్యానిస్తుంటారట.. నాడు ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకూ మన పరువు తీసి గంగలో కలిపేస్తారని.. రాజకీయాల కోసం నడిబజారులో నిలబడతారు అంటూ కథలు కథలుగా చెబుతుంటారట..

  ఇప్పుడు టీడీపీ నేతల రాజకీయం ఢిల్లీకి చేరింది. జగన్ పై హత్యాయత్నంతో దొరికిపోయిన చంద్రబాబు ఇప్పుడు దాన్నుంచి తప్పించుకునే యోచనలో కొత్త ఎత్తులు వేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.. ఢిల్లీకి వెళ్లి మోడీపై నెపాన్ని మోపడానికి రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. తనను  టార్గెట్ చేసి మోడీ రాజకీయాలు చేస్తున్నారనే ప్రచారాన్ని జాతీయస్థాయిలో తేబోతున్నారట.. జగన్ పై హత్యాయత్నంపై బీజేపీ ఎంపీ  జీవీఎల్ నరసింహారావు జ్యూడిషియల్ ఎంక్వైరీ  చేయాలని కోరడం... గవర్నర్ ఏపీ డీజీపీని నివేదిక కోరడాన్ని  సాకుగా చూపి  మోడీ తనను టార్గెట్ చేశాడని బాబు ఢిల్లీ స్థాయిలో తప్పుడు ప్రచారం చేయడానికి రెడీ అయ్యారని సమాచారం..   ఢిల్లీలోనే తేల్చుకుందామని రెడీ అయి శనివారం ఉదయం హస్తనలో దిగారు. జగన్ హత్యాయత్నంను తనపై రాకుండా బీజేపీపై మోపేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నట్టు సమాచారం.
 
 ఢిల్లీలోని జాతీయ పార్టీలతో పాటు జాతీయ మీడియాతో మాట్లాడి మోడీ యే జగన్ పై హత్యాయత్నం చేయించాడని తప్పుడు ప్రచారం చేయాలని బాబు ప్లాన్ చేశారని సమాచారం.  టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యాక అసలు ట్విస్ట్ మొదలవబోతోందనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంటులో కానీ ప్రధాని నివాసం వద్ద కానీ లేక జంతర్ మంతర్ వద్ద కానీ ఎంపీలతో కలిసి నిరసన దీక్ష చేస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆరాతీస్తున్నట్టు సమాచారం. అంతా మోడీ చేస్తున్నాడని  ఒక సీఎం ఢిల్లీ నడివీధిలో నిరసన తెలిపితే జాతీయ స్థాయిలో దుమారం రేగుతుందని బాబు భావిస్తున్నాడట... ఇలా మోడీని ఎండగట్టవచ్చని బాబు ప్లాన్ చేస్తున్నాడట.. అంతేకాదు.. దీనికి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని యోచిస్తున్నారట..

ఈరోజు కానీ.. రేపు కానీ ఈ తరహా నిరసనకు బాబు వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం.  జగన్ పై హత్యాయత్నాన్ని కూడా చంద్రబాబు తనపై రాకుండా ఇలా మోడీపై డైవెర్ట్ చేస్తున్న తీరును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. జగన్ పై హత్యాయత్నంపై జ్యూడిషియల్ లేదా సీబీఐ ఎంక్వైరీ వేసి బాబు బండారాన్ని బయటపెట్టాలని యోచన చేస్తున్నట్టు సమాచారం.  ఈరోజు సాయంత్రం వరకు చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారు.? మోడీ ఎలాంటి రియాక్షన్ ఇస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది.
    

Tags:    

Similar News