సీఎం ర‌మేశ్ పొడిగింపు వెనుక మీడియా అధినేత‌?

Update: 2018-03-12 04:25 GMT
ప‌ద‌వులు అంత తేలిగ్గా రావు. అందులోకి కీల‌క స్థానాల‌కు సంబంధించిన ఎంపిక అన్న‌ప్పుడు ఎన్నో కాంబినేష‌న్లు.. మ‌రెన్నో ఈక్వేష‌న్లు ఉంటాయి. అన్ని క‌లిసినా.. టైం.. అదృష్టం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. ఇందులో ఏ ఒక్క‌టి మిస్ అయినా.. చేతికి వ‌చ్చిన ప‌ద‌వి సైతం చివ‌రి క్ష‌ణంలో చేజారిపోయే అవ‌కాశం ఉంటుంది.

ఏపీలో జ‌రుగుతున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌లే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పాలి. రెండు స్థానాల్లో ఒక‌టి సీఎం ర‌మేశ్ కు ఖాయ‌మ‌ని మొద‌టి నుంచి అనుకుంటున్న‌దే రెండో దానికి వ‌చ్చేసరికి చాలానే అంచ‌నాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ప‌లువురి పేర్లు వినిపించాయి కూడా. చివ‌ర‌కు నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో క‌న‌క‌మేడ‌ల‌కు అవ‌కాశం ద‌క్కింది.

ఇదిలా ఉంటే.. సీఎం బాబుకు అత్యంత స‌న్నిహితుడైన సీఎం ర‌మేశ్ కు వ‌రుస‌గా రెండోసారి అవ‌కాశాన్ని ఇచ్చారు. ఇదేమంత పెద్ద విష‌యం కాదు. ఎందుకంటే.. బాబుకు అత్యంత స‌న్నిహితులైన కోర్ బ్యాచ్ లో సీఎం ర‌మేశ్ ఒక‌రు. మ‌రి అలాంట‌ప్పుడు ఆయ‌న‌కు కాకుండా మ‌రెవ‌రికి ప‌ద‌వి ఇచ్చే ఛాన్స్ లేద‌ని అనుకోవ‌చ్చు. కానీ.. బాబు మీద ఉన్న ఒత్తిడి నేప‌థ్యంలో ఏ నిమిషంలో ఏమైనా జ‌ర‌గొచ్చు.

ఈ విష‌యాన్ని గుర్తించిన సీఎం ర‌మేశ్ త‌న ప్ర‌య‌త్నాలు తాను చేసుకుంటూనే ఉన్నార‌ని చెబుతారు. బాబుకు అత్యంత స‌న్నిహితుడైన మీడియా అధినేత మాట సాయాన్ని తీర్చుకున్న‌ట్లుగా తెలుస్తోంది. త‌న సీటును ఎట్టి ప‌రిస్థితుల్లో చేజార‌కుండా చూసుకునేందుకు ఆయ‌న చేయాల్సిన ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లుగా స‌మాచారం. బాబు కోర్ టీంలో ఉన్నందున త‌న స్థానం ప‌క్కా అన్న విష‌యం తెలిసినా.. కించిత్ నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేద‌ని.. త‌న పేరు ప్ర‌క‌టించే వ‌ర‌కూ చేయాల్సిన ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

దీనికి త‌గ్గ‌ట్లే సీఎం ర‌మేశ్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌ట‌మే కాదు.. రెండోసారి ఆయ‌నకు అవ‌కాశం ఇస్తూ బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తిఒక్కరికి స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్పుకున్న ఆయ‌న‌.. స‌ద‌రు మీడియా అధినేత మ‌న‌సును భారీ ప్ర‌క‌ట‌నతో దోచేసుకున్నార‌ని చెబుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క‌లు తేల్చేసుకుంటే క్లారిటీతో పాటు.. అభిమానం సైతం లైవ్ గా ఉంటుంద‌న్న విషయం బిజినెస్ మేన్ సీఎం ర‌మేశ్‌ కు బాగా తెలుస‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News