అసలీ ఎఫైర్లకు అసలు కారణమేంటో తెలుసా?

Update: 2022-12-30 08:34 GMT
న్యూస్ పేపర్లు, టీవీ చానెళ్లలో రెగ్యులర్ గా వివాహేతర సంబంధాల నేపథ్యంలో హత్యలు, దాడులు నిత్యం చూస్తేనే ఉన్నాం. ఇటీవల కాలంలో ఇవి మరీ ఎక్కువయ్యాయి. కొందరు అందమైన భార్య ఉన్నా మరో మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. దానికి కారణాలు ఎన్నో చెబుతారు. కానీ ఒక పురుషుడు లేదా మహిళ తమ భాగస్వామిని కాదని ఇతర వ్యక్తితో ఎందుకు సంబంధం పెట్టుకుంటారు..? అన్న దానిపై నిర్వహించిన ఒక అధ్యయనం ఆసక్తి రేపింది.. మగవాళ్ల విషయానికొస్తే తమకు భార్య నుంచి ప్రేమ కరువైందని అంటున్నారు. కానీ శృంగారం విషయంలో సహకరించకపోవడమూ పెద్ద కారణమేనది పరిశీలనలో తేలింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా అధ్యయన కర్తలు, మానసిక వైద్యులు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు చెప్పారు. అవేంటో ఒకసారి చూద్దాం..

కొందరు పురుషులు తమకు ఉన్న సమస్యలు చెప్పుకోవడానికి సరైన వ్యక్తిని ఎంచుకుంటారు. పెళ్లికి ముందు క్లోజ్ ఫ్రెండ్ తో తన విషయాలను షేర్ చేసుకుంటారు. అయితే పెళ్లయిన తరువాత స్నేహితులతో కలిసే అవకాశం ఉండదు. అందువల్ల తమ సాధక బాధకాలను చెప్పుకోవడానికి  భార్య సహకరించకపోతే  మరో  వ్యక్తి కోసం సెర్చ్ చేస్తారు.  ఈ సమయంలో తన బాధలు వినే మహిళ  ఎదురైతే ఆమెతో ప్రేమగా ఉంటూ.. అలా హద్దులు దాటేస్తారట.

కొంతమందికి భార్యభర్తల సంబంధం గురించి పూర్తిగా అవగాహన ఉండదు. ఒక్కసారి పెళ్లయితే జీవితాంతం ఆమెతో కలిసి ఉండాలన్న భయం ఉండదు. సంసార జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని తట్టుకొని భాగస్వామితో కలిసుండేందుకే ప్రయత్నించాలి. కానీ చిన్న విషయాలకే భార్యను విడిచిపెట్టి మరో మహిళతో ఉండేందుకు ఇష్టపడుతారట. ఇది వివాహేతర సంబంధానికి దారి తీస్తుంది.

కొందరు మగాళ్లకు స్థిరత్వం ఉండదు. ఎంత మంచి భార్య ఉన్నా అంతకు మించి తృప్తి కావాలని కోరుకుంటారు. దీంతో వారి కోరికలు హద్దులు దాటుటాయి. తన కోరిక తీర్చుకోవడానికి భార్య, పిల్లల్ని పట్టించుకోరు. అలా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ తరువాత కష్టాల పాలవుతారు.

పెళ్లయిన తరువాత కొన్ని రోజులు హ్యాపీగానే ఉంటుంది. ఆ తరువాత గొడవలు ప్రారంభమవుతాయి. కానీ చిన్న చిన్న వాటికే తమ భార్యపై నెగెటివ్ ఫీలింగ్ కలుగుతుందట. ఇలా వారిని పక్కనబెట్టి ఇతర మహిళతో సంబంధం పెట్టుకోవడానికి ట్రై చేస్తారట. కానీ ఇలా వేరే మహిళతోనూ మనస్పర్థలు రాకుండా ఉండవని చెప్పలేం.

భార్య ఎప్పుడూ కళ్లముందే ఉంటుంది. అందువల్ల రోజూ ఒకలాగా ఉండడం ఇష్టముండదట. ఒకేలా ఉంటే బోర్ కొడుతుందట. ఇలా భార్య బోర్ అనిపించిన వాళ్లు ఇతర మహిళతో సంబంధాలు పెట్టుకుంటారట. దీంతో దాంపత్య జీవితం దెబ్బతింటుందని మానసిక వైద్యులు చెబుతున్నారు.

ఇక చాలా మంది పురుషులు ఇతర మహిళతో ఎఫైర్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం సెక్స్ లైఫ్. శృంగారంలో తనకు అనుకున్న విధంగా తృప్తి ఇవ్వలేదన్న కారణంతో మగాళ్లు ఇతర మహిళతో సంబంధాలు పెట్టుకుంటారట. ఇలా కొందరైతే చాలా మంది మహిళలతో సంబంధాలు పెట్టుకుంటారట. కానీ తన వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తుందన్న విషయం గ్రహించాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News