న్యూమరాలజీ దెబ్బకి ఇద్దరు మంత్రుల అవుట్

Update: 2016-03-04 09:54 GMT
త‌మిళ‌నాడు సీఎం జయలలిత తన మంత్రివర్గంలోని మంత్రులను వరుసగా తొలగించుకుంటూ పోతున్నారు. అమ్మ మాట జవదాటని వీర విధేయులను కూడా ఆమె ఎందుకు తప్పిస్తున్నారన్న ప్రశ్న అందరి బుర్రలనూ తొలిచేస్తోంది. అయితే... అందుకు కారణమంటూ కొత్త వాదన ఒకటి వినిపిస్తోంది.  తన సంఖ్యా శాస్త్ర సెంటిమెంట్లను అనుసరించి ఆమె ఈ ఉద్వాసన పర్వానికి తెర తీశారని అంటున్నారు.
   
తమిళనాట పదిరోజుల్లో ఇద్దరు మంత్రులకు ఊస్టింగ్ ఆర్డర్లు అందాయి. తాజాగా జయ కేబినెట్‌ నుంచి త‌ప్పించిన చిన్నయ్య అమ్మకు వీర విధేయుడు. సాష్టాంగ నమస్కారం తప్ప మామూలు నమస్కారం చేసి ఎరుగని మంత్రి ఆయన. అలాంటి చిన్నయ్యను కూడా తొల‌గించడం ఇప్పుడు అంద‌రికీ ఆశ్చర్యం క‌లిగించింది. అత్యంత విధేయుడ‌నుకున్న మంత్రినే ఇంటికి సాగ‌నంప‌డంతో అమ్మ ఆగ్రహానికి ఎవ‌రికి తోచిన కార‌ణాల్ని వారు వెతుక్కుంటున్నారు. కానీ జ‌య‌ల‌లిత తీసుకున్న నిర్ణయానికి అస‌లు కార‌ణం వేరే ఉంద‌ట‌. సంఖ్యాశాస్త్రంపై ఎంతో న‌మ్మక‌మున్న జ‌య కేబినెట్ మంత్రుల సంఖ్యను బ్యాలెన్స్ చేసేందుకే చిన్నయ్య బ‌క‌రా అయ్యాడ‌ని స‌మాచారం. తొమ్మిది అంకె కోసం కేబినెట్‌ ని 27కి కుదించే ప్రయ‌త్నంలో చిన్నయ్యని తప్పించారట.
   
త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనుండడంతో అన్ని రకాలుగా జాగ్రత్త పడుతున్న ఆమె ఇప్పుడు న్యూమరాలజీ లెక్కలతో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని వినికిడి.
Tags:    

Similar News