ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ వద్ద ఇండోర్- పాట్నా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి 150 మంది మరణించడానికి రైల్వే అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. రైలు కండిషన్ బాగులేదని డ్రైవర్ ప్రతి స్థాయిలోనూ అధికారులకు చెప్పినా కూడా వారు వినకుండా రైలు నడుపుకొంటూ రావాలని ఒత్తిడి చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు రైలుకు అదనపు బోగీని జోడించడమే ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు.
సాధారణంగా ఈ రైలు 22 బోగీలతో నడుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన రోజున రైలుకు అదనంగా మరో బోగీని చేర్చారని, దీని కారణంగానే రైలుకు స్థిరత్వం లోపించి పట్టాలు తప్పడానికి దారితీసిందని నిపుణులు అంటున్నారు.
రైల్వే సేఫ్టీ (తూర్పు సర్కిల్) కమిషనర్ పికె ఆచార్య ఈ ప్రమాదానికి వెనుక కారణాలపై అధికారికంగా దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్లులో పలు అంశాలు వెల్లడవుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరగడానికి ముందు - ఎస్-1 - బి-3 బోగీలు పెద్ద శబ్దంతో కుదుపునకు లోనయినట్లు ప్రయాణికులు తెలిపారు. రైలు డ్రైవర్ జనక్ శర్మ - కోడ్రైవర్ - పుఖ్రయా - ఝాన్సీ స్టేషన్ల మాస్టర్లను ప్రశ్నించగా అసలు గుట్టు బయటపడింది.
ఇదీ జరిగింది..
- రైలుకు చెందిన బోగీల్లో కనీసం ఒకదానిలో సమస్య ఉన్నట్లు డ్రైవర్ శర్మకు సమాచారం అందిందని - ఆయన ఆ విషయాన్ని ఒక సీనియర్ అధికారికి మెస్సేజి కూడా పంపించారని, అయితే ఏదో ఒక విధంగా రైలును కాన్పూర్ చేర్చమని ఆ అధికారి ఆయనకు చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
- కాన్పూర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుఖ్రయా స్టేషన్ వద్ద కూడా డ్రైవరు రైలును ఆపి సమస్యను స్టేషన్ మాస్టర్ కు కూడా తెలియజేశారని, అయితే కాన్పూర్ కు వెళ్లమని స్టేషన్ మాస్టర్ ఆదేశించినట్లు తెలుస్తోంది,
కాగా ప్రమాదానికి సంబంధించి ఐదుగురు అధికారులను రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే సస్పెండ్ చేసింది. మరి.. రైలులో లోపముందని డ్రైవర్ పదేపదే మొత్తుకున్నా అధికారులు ఎందుకు పెడచెవినపెట్టారు. ఏదోరకంగా కాన్పూర్ చేర్చమని ఎందుకు కోరారు. వందల మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి రైలును ఎందుకు నడిపించారు. కండిషన్ బాగులేని రైలును అక్కడే ఆపేస్తే వచ్చే నష్టమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైలును సగంలో ఆపేస్తే వేరే రైలు ఏర్పాటు చేయడం వంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఎవరికి వారు నిర్లక్ష్యం చూపడంతోనే ప్రమాదం జరిగినట్లు అర్థమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/