తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత - సీఎం కేసీఆర్ ఆదివారం నుంచి దుబాయ్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. దుబాయ్ లో కేసీఆర్ మూడు రోజులు ఉంటారని అధికారవర్గాలు తెలిపాయి. కొందరు అంతర్జాతీయ ప్రముఖులు - వివిధ పారిశ్రామిక వర్గాల అధికారులతో ఆయన సమావేశమవుతారు. ఆయన వెంట పార్టీ సన్నిహితులు - నాయకులు - అధికారులు కూడా బయలు దేరి వెళుతున్నారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలుపులో ఎన్ ఆర్ ఐలు కీలక పాత్ర పోషించారు. టీఆర్ ఎస్ విజయానికి వారు కృషి చేశారు. అందుకే వారిని వ్యక్తిగతంగా కలిసి కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల సందర్భంగా వేల సంఖ్యలో ఉన్న గల్ఫ్ కార్మికులు తెలంగాణలోని తమ సొంత ఊళ్లకు వచ్చి టీఆర్ ఎస్ కు వారందరూ ఓటు వేశారు. వారి కుటుంబాలను టీఆర్ ఎస్ కే ఓటు వేయించేలా చేశారు.
అంతేకాదు.. ఎన్ ఆర్ ఐలు తెలంగాణకు వచ్చి ఓటేసేందుకు వారికి విమాన టికెట్లను కూడా టీఆర్ ఎస్ పార్టీ సమకూర్చింది. అందుకే గల్ఫ్ కార్మికులు - వారి కుటుంబీకులు కూడా తమ వారిని దగ్గరకు చేర్చిన సంతోషంలో గులాబీ పార్టీకి ఓట్ల వాన కురిపించారు. గల్ఫ్ కార్మికులను తెలంగాణకు రప్పించడంలో తెలంగాణ బడా ఎన్ ఆర్ ఐలు టీఆర్ ఎస్ పార్టీకి నిధులను సమకూర్చారు. తెలంగాణ కు చెందిన దుబాయ్ లో ఉండే బడా పారిశ్రామికవేత్తలు - ఎన్ ఆర్ ఐలు టీఆర్ ఎస్ పార్టీకి ఇందుకోసం నిధులను విరాళంగా ఇచ్చారు. గల్ఫ్ కార్మికులకు - నిధులు సమకూర్చిన ఎన్ ఆర్ ఐలకు కృతజ్ఞత తెలుపడానికే కేసీఆర్ దుబాయ్ పర్యటనను అవకాశంగా మలుచుకుంటున్నట్టు టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పర్యటన ముగిశాక గల్ఫ్ ఎన్ ఆర్ ఐలను హైదరాబాద్ రప్పించి వారిని టీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సత్కరించనున్నట్టు సమాచారం. వారిని ఆహ్వానించేందుకు కేటీఆర్ - కవిత లేదా సీనియర్ నాయకులను దుబాయ్ పంపడానికి ఏర్పాట్లు కూడా చేశారట..
దుబాయ్ లోని గల్ఫ్ కార్మికులకు కృతజ్ఞతలు తెలుపడానికే కేసీఆర్ వెళుతున్నట్టు చెబుతున్నప్పటికీ మూడు రోజుల కేసీఆర్ పర్యటన విషయంలో అంతటా గోప్యత నెలకొంది. అయితే కొన్ని గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని ముగించవచ్చు. కానీ ఎన్నికలతో అలసిసొలసిన కేసీఆర్ కాస్త విహారంగా మనసు మరల్చుకోవడానికి దుబాయ్ పర్యటనను వేదికగా చేసుకున్నారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.