ఒకే విడతలో 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ కేవలం 14 స్థానాలకు మాత్రమే పెండింగులో ఉంచారు. అందులో నాలుగు బీజేపీ ఎమ్మెల్యేలున్న స్థానాలు కావడం విశేషం. తెలంగాణలో మొత్తం అయిదుగురు బీజేపీ ఎమ్మెల్యేలుండగా అందులో కేవలం ఉప్పల్ స్థానానికి మాత్రమే కేసీఆర్ ప్రస్తుతం అభ్యర్థిని ప్రకటించారు. మిగతా నాలుగు చోట్ల అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంతో మోదీతో కేసీఆర్ నడుపుతున్న రహస్య సయోధ్య కారణంగానే ఇలా చేశారన్న ప్రచారం జరుగుతోంది.
బీజీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు స్థానాల్లో కేవలం ఉప్పల్ సీటులో మాత్రమే అభ్యర్థిని ప్రకటించారు. ఉప్పల్ సిట్టింగ్ గా ఎన్విఎస్ ఎస్ ప్రభాకర్ ఉన్నారు.. అక్కడ టీఆరెస్ అభ్యర్థిగా బేతి సుభాష్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. అంబర్ పేట ఎమ్మెల్యేగా బీజేపీ నేత కిషన్ రెడ్డి - ముషీరాబాద్ లో డాక్టర్ లక్ష్మన్ - ఖైరతాబాద్ లో చింతల రామచంద్రారెడ్డి - గోషామహల్ లో రాజాసింగ్ ఉన్నారు. ఈ నాలుగు స్థానాలకూ ప్రస్తుత జాబితాలో కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించలేదు.
మరోవైపు ఎంఐఎంతోనూ తమకు ఎన్నికల సయోధ్య ఉంటుందని కేసీఆర్ క్లియర్ గా చెప్పారు. ఎంఐఎం పార్టీ తమకు ఫ్రెండ్లీ పార్టీ అని ఆయన చెప్పారు. ఎంఐఎం సభ్యులుగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అక్కడ కేవలం స్నేహపూర్వక పోటీ మాత్రమే ఉంటుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులనే బరిలోకి దించినట్లు చెబుతున్నారు.