మోడీ లేడు.. గీడీ లేడు అన్న నోటితోనే మోడీ సంస్కరణవాది అని అనాల్సి వచ్చింది. అందులోనూ మోడీ లేడు గీడీ లేడు అని తెలంగాణలో అంటే సంస్కరణ వాది అని దేశాంతరాలకు పోయి చైనాలో అనాల్సి వచ్చింది. మోడీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అన్న నోటితోనే మోడీ ముఖ్యమంత్రులను అందరినీ కలుపుకుని వెళుతున్నారని కితాబు ఇవ్వాల్సి వచ్చింది. ఇదీ ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి.
తెలంగాణకు నిధులు రావాలంటే ఇతర దేశాలకు వెళ్లాల్సిందే. అక్కడి నుంచి తీసుకు రావాలంటే ఏదో ఒక బ్రాండ్ ఉండాలి. చంద్రబాబు నాయుడుకు అయితే ఆయనే ఒక బ్రాండ్. దానిని ఆయనే క్రియేట్ చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ను ఒక బ్రాండ్ చేశాడు. హైదరాబాద్ ను ఒక బ్రాండ్ చేశాడు. కనక మోడీ ఆయనకు అదనపు ఆకర్షణ మాత్రమే. తన బ్రాండ్ ను చూపించి.. మోడీ బ్రాండ్ ను ఉపయోగించి ఆయన రుణాలను తెచ్చకోగలడు. కానీ, కేసీఆర్ పరిస్థితి అది కాదు. కేసీఆర్ కు ప్రత్యేకంగా బ్రాండ్ లేదు. ఆయన బ్రాండ్ తెలంగాణ బయట పని చేయదు. రాష్ట్రాల విభజనకు, దేశాన్ని ముక్కలు చేయడానికి పనికి రావచ్చు. కానీ, రుణాలు తీసుకు రావడానికి పని చేయదు. ఇక నిన్న గాక మొన్న పుట్టిన తెలంగానకు ప్రత్యేక బ్రాండ్ లేదు. కేసీఆర్ కు బ్రాండ్ ఉంటేనే తెలంగాణకు వస్తుంది. తెలంగాణకు ఉంటే కేసీఆర్కు వస్తుంది. కానీ, ఇద్దరికీ బ్రాండ్ లేదు. ఇక హైదరాబాద్ బ్రాండ్ ను ఉపయోగించుకుందామా అంటే అది చంద్రబాబు నాయుడు సృష్టించిన బ్రాండ్. గత ఏడాదిన్నరగా కేసీఆర్ ఏర్పరచిన బ్రాండ్ ఏమీ లేదు. ఈ నేపథ్యంలో మోడీ బ్రాండ్ ను ఉపయోగించుకోవాల్సిందేనని, ఆయనను ఉపయోగించుకుని తెలంగాణకు బ్రాండ్ క్రియేట్ చేయాల్సిందేనని, అప్పుడు మాత్రమే కేసీఆర్ విదేశీ పర్యటనలు విజయవంతం అవుతాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు ఇది రెండో పర్యటన అని, వీటి ద్వారానే ఆయన తనకు అయినా, తెలంగాణకు అయినా బ్రాండ్ ఏర్పాటు చేయగలడని, అంత వరకు మోడీ బ్రాండ్ ను ఉపయోగించక తప్పదని చెబుతున్నారు.