కేసీఆర్ కఠినత్వానికి కారణమిదేనా?

Update: 2019-11-03 06:28 GMT
రాజకీయాల్లో గెలుపే అంతిమ నిర్ణయం.. గెలిచినవారిదే ప్రజా పాలన కింద లెక్క. ఓడిపోతే మాత్రం తమ పాలన బాగా లేదని రాజకీయ నాయకులు సమీక్షించుకుంటారు. ఆ దిశగా కాస్త తగ్గి ప్రజల కోరికలు తీరుస్తారు. కానీ హుజూర్ నగర్ లో గెలుపు ఇప్పుడు కేసీఆర్ ను మరింత రాటు దేల్చిందనే చెప్పాలి. అందుకే ఆర్టీసీ సమ్మె మొదలై నెలరోజులు అవుతున్నా.. కార్మికులు మరణిస్తున్నా వెనక్కి తగ్గకుండా కేసీఆర్ సగం ప్రైవేటు ఇవ్వడం వెనుక హుజూర్ నగర్ ప్రజాతీర్పు ఇచ్చిన ప్రోత్సాహమే కారణమన్న వాదన వినిపిస్తోంది.

హుజూర్ నగర్ కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. పైగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కంచుకోట.. ఆయన భార్య పోటీచేసిన ఈ సీటును టీఆర్ ఎస్ గెలిచినప్పుడే కేసీఆర్ ఇక తన నిర్ణయాలు తప్పుడివి కాదని నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా.. ఇంత లొల్లి జరుగుతున్నా టీఆర్ ఎస్ గెలవడమే ఓ సంచలనం.. నిజానికి ఇక్కడ వ్యతిరేకత బాగా ఉందని తెలిసి కేసీఆర్, కేటీఆర్ సైతం ప్రచారానికి వెళ్లలేకపోయారు. ఈ సీటుపై ఆశలు కూడా వదులుకున్నారు.

కానీ ఎప్పుడైతే టీఆర్ ఎస్ 50వేలకు పైగా మెజార్టీతో గెలవడం.. బీజేపీకి డిపాజిట్ రాకపోవడంతో ఇక తను చేసేదే కరెక్ట్ అని ప్రజలు ఆశీర్వదించారని.. ముందుకు వెళ్లాలని ఈ గెలుపుతో నిరూపించారని కేసీఆర్ చెప్పుకొచ్చాడు.

నిజానికి తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్రా ప్రాబల్యమున్న హుజూర్ నగర్ లో టీఆర్ ఎస్ గెలవడం అంటే అంత ఆశామాషీ కాదు. అయితే గెలవడంతో కేసీఆర్ ఇక తాను సమ్మె విషయంలో తీసుకున్న స్టెప్ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు. అందుకే నిన్న సగం ఆర్టీసీని ప్రైవేటీకరించారు. అంతిమంగా ప్రజాతీర్పుకే నేతలు శిరసావహిస్తారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ నిర్ణయమే ప్రజలు కరెక్ట్ అని అనుకున్నట్టు కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఇలా కఠినంగా ముందుకు వెళుతున్నారు.
Tags:    

Similar News