తరాలుగా వస్తున్న బస్సుల నిర్వహణ వ్యాపారాన్ని హఠాత్తుగా మూసివేసిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆవేదన పూరితంగా మాట్లాడిన అంశం చర్చనీయాంశంగా మారింది. తానేమీ దొంగతనంగా వ్యాపారం చేయలేదని, అయినా తాను ఆర్టీసీకి బస్సులు పెట్టనని ప్రకటించారు. వ్యవస్థతో తాను పోరాటం చేయలేకపోతున్నానని కూడా నాని ప్రకటించారు. నాని ఇంత ఇబ్బందికరమైన స్టేట్ మెంట్లు ఇవ్వడం వెనుక కారణం ఆయన అనుకున్నది అన్నట్లుగా జరగలేకపోవడమేనని చెప్తున్నారు. తన బస్సుల్ని ఆర్టీసీ తీసుకునేలా చూడాలని ఎంపీ కేశినేని నాని సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిసింది. దీంతో అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు రవాణా - ఆర్టీసీ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. కొత్తగా ఏసీ బస్సుల్ని తీసుకోవడం వల్ల నష్టాలు మరింత పెరుగుతాయని అధికారులు చెప్పడంతో కేశినేని నాని నిరాశ చెందినట్లు సమాచారం.
కేశినేని ట్రావెల్స్ మూసివేత అనంతరం సీఎం చంద్రబాబును కలిసిన నాని తన బస్సుల్ని ఆర్టీసీ తీసుకునేలా చూడాలని కోరారు. దీనిపై ఆర్టీసీ అధికారులతో బాబు సమావేశం నిర్వహించగా... ఆ బస్సులను తీసుకుంటే నిర్వహించలేమని ఆర్టీసీ చెప్పింది. కేశినేని సంస్థలో చాలా బస్సులు కండిషన్లో లేవని, దీనివల్ల నిర్వహణా పరంగా నష్టం వస్తుందని ఆర్టీసీ యాజమాన్యం సీఎం దృష్టికి తీసుకెళ్లింది. అయితే కండిషనల్లో ఉన్న బస్సుల్ని తీసుకోవాలని చంద్రబాబు అన్నట్లు సమాచారం. రవాణా అధికారులు మాత్రం దీనికి విముఖంగా ఉన్నప్పటికీ కండీషన్ గురించి ఆలోచించొద్దని, బస్సులు తీసుకునే మార్గాన్ని చూడాలని ఆర్టీసీ అధికారులకు సీఎం సూచించినట్లు తెలిసింది. దీంతో ఈ విషయం పెద్ద చర్చనీయాంశమైంది. అనంతరమే నాని ప్రెస్ మీట్ జరిగింది.
ఇదిలాఉండగా...కేశినేని బస్సులు తీసుకోవద్దని పలు కార్మిక సంఘాలు చెప్తుండగా తన బస్సులు తీసుకునేలా చూడాలని కేశినేని ఓ కార్మిక సంఘంతో చర్చిస్తున్నట్లు తెలిసింది. కార్మిక సంఘాలతో ఆర్టీసీపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎంపీ ప్రయత్నిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అంటున్నారు. ఇప్పటి వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్టాండు ముందే బస్సుల్ని పెట్టి ప్రయాణికుల్ని ఎక్కించుకు వెళుతున్నాయని, వాటిని కేశినేని నాని కూడా ప్రోత్సహించారని, ప్రజాప్రతినిధిగా ఆయన ఆర్టీసీ నష్టాల్ని పట్టించుకోలేదని అధికారులు చెప్తున్నారు. సంస్థ నష్టపోయిందని చెప్పిన అదే వ్యక్తి తన బస్సులను ఆర్టీసీ తీసుకోవాలని ఒత్తిడి తేవడమంటే సంస్థను అవమానించడ మేనని, దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే కేశినేని విషయంపై రాజకీయ కోణంలోనూ అనేక విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్‌లో ఆర్టీసీని జిల్లాల వారీగా విడదీసి నిర్వహించనున్నారని గతంలో వార్తలొచ్చాయి. దీనివల్ల నిర్వహణా భారం తగ్గి నష్టాలు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఆర్టీసీని జిల్లాల వారీగా విడదీస్తే నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. ఈ కోణంలోనే కేశినేని తన బస్సులను ఆర్టీసీలోకి పంపించడం ద్వారా భవిష్యత్‌లో జిల్లాల వారీగా ఏజెన్సీలను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చెప్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/