మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. సినీ హీరో - టీడీపీ నేత బాలకృష్ణకు వ్యతిరేకంగా ఆయన రోజువారీ చేస్తున్న ట్వీట్లు, ఫేస్ బుక్ లో పెడుతున్న పోస్టులు కాక పుట్టిస్తున్నాయి. ఆయన విమర్శల వెనుక ఆంతర్యమేమై ఉంటుందనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తన తమ్ముడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు లబ్ధి చేకూర్చేలా కాపు ఓటర్లను ఏకతాటి పైకి తెచ్చేందుకే నాగబాబు సోషల్ మీడియాలో బాలయ్య పై వార్ నడిపిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై బాలకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడన్నది వాస్తవం. అయితే - ఆ వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు కాదు. దాదాపు ఏడాది క్రితం. మరి అప్పట్లో సైలంట్ గా ఉన్న నాగబాబు ఇప్పుడు నోరు మెదుపుతుండటం, బాలయ్య పై విమర్శలు గుప్పిస్తుండటం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. ఏదైనా అనేది ఉంటే అప్పట్లోనే అని ఉండాల్సింది కాదా అని చెవులు కొరుక్కుంటున్నారు.
అయితే - నాగబాబు ఇప్పుడిలా రోజుకో మాటతో బాలయ్య పై విరుచుకుపడుతుండటం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. అదే.. కాపుల ఏకీకరణ. ప్రస్తుతం కాపు యువత ఎక్కువగా పవన్ వెనుకే ఉన్నారు. వారి ఓట్లు జనసేనకు పడటం లాంఛనమే. యువత మినహా మిగతా కాపులు మాత్రం జనసేనకు మద్దతు పలికే విషయం పై క్లారిటీతో లేరు. దీంతో వారందరినీ ఏకం చేయాలని నాగబాబు భావిస్తున్నారట. ఆ ప్రయత్నాల్లో భాగంగానే బాలయ్య పై దూకుడుగా వ్యవహరిస్తున్నారట.
గతంలో ప్రజారాజ్యం ఉన్నప్పుడు కాపులు మొత్తంగా ఆ పార్టీకి అండగా నిలబడలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో విజయావకాశాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ తప్పు రిపీట్ అవ్వొద్దని మెగా ఫ్యామిలీ భావిస్తోంది. కాపు ఓటు బ్యాంకు ఏమాత్రం చీలకుండా గంపగుత్తగా ఓట్లన్నీ జనసేనకే వచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా బాలయ్యపై నాగబాబు విరుచుకుపడుతున్న తీరు జనసేనకు మేలు కలిగిస్తున్న సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ - బాలకృష్ణ పై వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మెగా బ్రదర్ నాగబాబు తన తమ్ముడు పవన్ కోసం బాగానే కష్టపడుతున్నాడన్న మాట!
Full View