మంత్రి అయిన నాటి నుంచి పబ్లిక్ మీటింగుల్లో తరచుగా నోరు జారుతూ నవ్వుల పాలైపోతున్నాడు నారా లోకేష్. ఇది లోకేష్ తండ్రి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆత్మరక్షణలోకి పడేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి ఐటీ పెట్టుబడులు ఆకర్షించేందుకు.. ప్రముఖ కంపెనీల ప్రతినిధుల్ని కలిసేందుకు అమెరికా పర్యటనకు వెళ్లాల్సిన ప్రతినిధుల బృందంలో లోకేష్ కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
బుధవారం అర్ధరాత్రి చంద్రబాబు సహా 15 మంది ఏపీ ప్రతినిధుల బృందం అమెరికా బయల్దేరుతోంది. ముందు అనుకున్న ప్రకారం ఈ బృందంలో లోకేష్ కూడా ఉండాల్సింది. కానీ కేంద్రం అనుమతించిన 15 మంది బృందంలో అనూహ్యంగా లోకేష్ పేరు కనిపించలేదు. ఇందుకు కారణాలేంటన్నది తెలియడం లేదు. కేంద్రమే సాంకేతిక కారణాలతో లోకేష్ కు అనుమతి నిరాకరించిందని ఒక వాదన వినిపిస్తుండగా.. లోకేష్ తప్పుకున్నాడంటూ మరో వాదనా తెరమీదికి వచ్చింది.
ఇటీవలి కాలంలో అనవసర వివాదాలతో వార్తల్లో నలిగిన నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఏదైనా పొరబాటు జరిగితే.. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని.. అలాగే లోకేష్ ఇమేజ్ బాగా దెబ్బ తింటుందని.. అది ప్రభుత్వానికి కూడా చేటు చేస్తుందని భావించి చంద్రబాబు కొడుకును పక్కనబెట్టినట్లు చెబుతున్నారు. ఈ పర్యటన కోసం తాను బాగా ప్రిపేరయ్యాయని.. ఎక్కడా పొరబాటు లేకుండా చూసుకుంటానని చెప్పినప్పటికీ.. పార్టీ నేతలు కూడా లోకేష్ కు మద్దతుగా మాట్లాడినప్పటికీ చంద్రబాబు వినలేదని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/