జైల్లో ఊచలు లెక్కబెడుతున్న ఇంద్రాణి ముఖర్జీ ఘోషిస్తున్నట్లుంది అందుకే కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి. చిందబరం కుమారుడు కార్తి చిదంబరంని సీబీఐ అరెస్ట్ చేసిందని నెటిజన్లుకామెంట్ చేస్తున్నారు.
ఐఎన్ఎక్స్ మీడియా మాజీ సిఈఓ ఇంద్రాణి ముఖర్జీ జైలు జీవితం గడుపుతున్నవిషయం తెలిసిందే.2012 ఏప్రిల్ లో తన కన్న కూతుర్ని గొంతు నులుమి హత్య చేసిందనే ఆరోపణలు రావడంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇదిలా ఉంటే ఇంద్రాణి ముఖర్జీయా సీఈఓగా చెలామణి అయ్యే సమయంలో డొల్ల కంపెనీలు స్థాపించి కోట్లాది రూపాయల్ని రుణంగా పొందినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయంపై సీబీఐ చిదంబరం కొడుకు కార్తిని అరెస్ట్ చేసింది.
అయితే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తి చిదంబరం , పీటర్ ముఖార్జియా, ఇంద్రాణి ముఖర్జియాలపై సీబీఐ కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టింది. ఐఎన్ ఎక్స్ మీడియా పేరుతో పీటర్ ముఖార్జియా తన భార్య ఇంద్రాణి ముఖార్జియా అధినేతగా చేరుస్తూ 2007లో ఐఎన్ఎక్స్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐఎన్ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఐపిఎం ఇన్‌కోన్ ప్రైవేట్ లిమిటెడ్, ఐఎన్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పలు సంస్థలను స్థాపించారు.
ఆ కంపెనీల పేరుతో విదేశీ పెట్టుబడుల ప్రోత్సహాకాల బోర్డు నిబంధనలకు విరుద్దంగా మారిషస్ నుంచి పెట్టుబడులు స్వీకరించారు. అలా డొల్ల కంపెనీలు స్థాపించిన వీరిద్దరూ 2012లో ఐఎన్ఎక్స్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సింగపూర్ ప్రభుత్వానికి చెందిన టెమాసెక్ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. ఆ వాటాల్ని అమ్మేశారు.
2007లో ఇంద్రాణి మరో కంపెనీ ఐపిఎం ఇన్ కోన్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతిగా వెళ్లారు. అయితే ఐఎన్ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాలు కొనుగోలుచేయడానికి పీటర్ ముఖార్జియా - ఇంద్రాణి ముఖర్జియా రూ.10కోట్లు రుణంగా పొందారు. అలా పలు కంపెనీల నుంచి పెద్దమొత్తంలో రుణాల్ని పొంది వ్యాపార కార్యకలాపాల్ని కొనసాగించారు.
దీంతో సీబీఐకి అనుమానం రావడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించింది. అయితే లొసుగుల్ని బయటపడకుండా ఉండేలా అప్పటి కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం భారీ ఎత్తున లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ దర్యాప్తుప్రారంభించింది. కేసు దర్యాప్తులో బాగంగా సీబీఐ కార్తి చిదంబరాన్ని అరెస్టు చేసింది.