జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎక్కడికైనా వస్తున్నారంటే జనం ఎంతగా పోటెత్తుతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా సందర్భాల్లో తనకున్న ఇమేజ్ కారణంగా వ్యక్తిగతంగా తాను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెబుతారు. ఇక.. ఎవరైనా బంధువులు.. దగ్గర వాళ్లు చనిపోతే వారిని పరామర్శించేందుకు వెళ్లటానికి వీలు కాని పరిస్థితి ఉందని పవన్ చెప్పేవారు. పవన్ వస్తున్నారంటే చాలు జనంతో రోడ్లు కిక్కిరిసిపోవటం మామూలే. ఆయనకున్న సినిమా గ్లామరే దీనికి కారణం.
అయితే.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థలో వచ్చిన ఒక వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా పవన్ మూడు చోట్ల నిర్వహించాల్సిన సభల్ని రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన చోడవరం.. అనకాపల్లి.. పెందుర్తిలలో ఆయన సభల్ని నిర్వహించాలి. కానీ.. వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం.. జనం పెద్దగా లేరన్న సమాచారమేనని చెబుతున్నారు.
ఒకప్రముఖ మీడియా సంస్థ పబ్లిష్ చేసిన వార్త ప్రకారం చూస్తే.. పవన్ సభలకు జనం పెద్దగా రాకపోవటంతోనే సభల్ని రద్దు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పటివరకూ పవన్ సభల్ని చూసినప్పుడు పెద్ద ఎత్తున జనసందోహం వచ్చినట్లుగా మీడియాలో వచ్చిన వార్తలు.. టీవీ చానళ్లలో చూపించే లైవుల్లో కనిపిస్తోంది. అలాంటిది ఉన్నట్లుండి పవన్ సభలకు జనం పలుచగా రావటం వెనుక కారణం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
ఇటీవల కాలంలో పవన్ మాటలు రోటీన్ గా ఉండటం.. అధికారపార్టీని వదిలేసి.. విపక్ష జగన్ పార్టీను టార్గెట్ చేసినట్లు మాట్లాడటం.. పవన్ ప్రసంగాల్లో పస లేకపోవటం లాంటి కారణాలతో జనంలో ఆసక్తి తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా స్టార్ గా పవన్ కున్న ఇమేజ్ తో వస్తున్న జనం.. తన తీరుతో తన ఇమేజ్ ను తగ్గించుకుంటున్న భావన వ్యక్తమవుతోంది. జనం నుంచి వస్తున్న రియాక్షన్ తో అయినా.. పవన్ తన తీరును మార్చుకుంటే బెటరేమో?