ర్యాపిడ్ టెస్టుల్లో తేడా..కనిపెట్టిన రాజస్థాన్.. వాడొద్దన్న కేంద్రం

Update: 2020-04-21 12:00 GMT
పెద్ద సంఖ్యలో సమాజంలో వ్యాధి వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వాలు ‘ర్యాపిడ్ కరోనా టెస్టులు’ నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్షల ద్వారా సమాజంలో ఎంతమంది కరోనా వైరస్ ను ఎదుర్కొన్నారన్నదానిపై ఓ అంచనాకు రావచ్చు. ఇందులో పాజిటివ్ వచ్చాక పూర్తి పరీక్షలో కూడా పాజిటివ్ వస్తేనే ఆ వ్యక్తి కరోనా పాజిటివ్ గా గుర్తించి చికిత్స చేస్తారు.

అయితే ఈ కరోనా వైరస్ ర్యాపిడ్ టెస్టులను రాజస్థాన్ ప్రభుత్వం నిలిపేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలికి కూడా సమాచారం అందించింది.

ఈ కరోనా ర్యాపిడ్ టెస్లు ఫలితాల్లో ఆశించిన కచ్చితత్వం లేని కారణంగా ఈ తరహా టెస్టులను నిలిపివేస్తున్నట్టు రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది. ర్యాపిడ్ టెస్టులతో 90శాతం ఖచ్చితత్వం ఆశించామని.. కానీ కేవలం ఈ కిట్ల ద్వారా 5.4శాతం మాత్రమే ఖచ్చితత్వం వస్తోందని రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది. దీనిపై నిపుణుల కమిటీని వేసింది. వారు జరిపిన అధ్యయనంలో కూడా 5.4శాతమే ఖచ్చితత్వం రావడంతో ఇక ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వాడకూడదని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ తోపాటు చాలా రాష్ట్రాలు కేంద్రం పంపించిన ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లతోనే పరీక్షలు జరుపుతున్నాయి. రాజస్థాన్ లో ఇవి ఫెయిల్ కావడంతో ఇప్పుడు కిట్స్ సామర్థ్యంపై అనుమానాలు కలుగుతున్నాయి.

తాజాగా ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఫెయిల్ అవ్వడంపై కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది ర్యాపిడ్ టెస్ట్ కిట్లను రెండు రోజుల పాటు వినిగించవద్దని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ టెస్ట్ కిట్లపై విచారణ  జరుపుతున్నామని.. ఈ కిట్లను రిప్లేస్ చేస్తామని కేంద్రం తెలిపింది. కాగా ఈ కిట్లను ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసింది కేంద్రం. ఆయా రాష్ట్రాలు చేస్తున్న వేళ రాజస్థాన్ లో ఫెయిల్ కావడంతో వాటి నాణ్యతపై అనుమానాలు కలిగి అన్ని రాష్ట్రాలను వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లో కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపింది.
Tags:    

Similar News