శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ నోట్..అసలు నిజమిదే.!

Update: 2019-09-03 10:34 GMT
ఏపీ సీఎం వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో ఈ విషయాన్ని నిగ్గు తేల్చేపనిలో పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణ పేరుతో  కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన శ్రీనివాసురెడ్డిని పిలిచారు. అయితే తన ప్రమేయం లేకున్నా తనను ఈ హత్య కేసులో పిలవడంతో ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అయితే సూసైడ్ కు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు తనను సంబంధం లేకున్నా పిలిచారని.. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు సూసైడ్ నోట్ ను బయటపెట్టి ఇది పోలీసులు చేసిన హత్యగా చిత్రీకరించారు.

అయితే తాజాగా శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ పై పోలీసులు నోరు విప్పారు. దీనిపై అనుమానాలను వారు వ్యక్తం చేశారు.  శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ పై కడప డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘కానిస్టేబుళ్లు పొరపాటున ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాసులు రెడ్డిని తీసుకొచ్చారు. అది గుర్తించి కేవలం 5 నిమిషాల్లోనే ఆయన కాదని పంపించివేశాం’ అని వివరణ ఇచ్చారు.

అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడం.. కారణం పోలీసులు అని పేర్కొనడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ కు పోలీసులే కారణం అంటూ రాసిన సూసైడ్ లో రెండు రాతలు ఉన్నాయని తేలిందని పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టారు.  త్వరలోనే అసలు నిజం బయటపెడుతామని పేర్కొన్నారు.పోలీసులను అభాసుపాలు చేయడానికి శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ ను వాడుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు.

    

Tags:    

Similar News