జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి?

Update: 2019-09-18 09:07 GMT
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వానికి మరిన్ని మరకలు పడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అసలు నాయకుడేనా? అంటూ తెలుగుదేశం వాళ్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి నేతగా ఉంటే.. కోడెల శివప్రసాద్ వంటి సీనియర్ కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతూ  ఉన్నారు.

కోడెల బతికి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తీరేమిటో అంతా గమనించారు. ఆయనకు మద్దతుగా ఒక్క మాట మాట్లాడలేదు. ఆయనకు మద్దతుగా పార్టీలోని వాళ్లు కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. అదంతా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకే అని టాక్.

స్పీకర్  గా కోడెలను కూర్చోబెట్టి.. ఫిరాయింపుల మీద చంద్రబాబు నాయుడు ఆయన చేత తను చెప్పినట్టుగా చేయించుకున్నారు. అలా కోడెలను ఒక విఫల స్పీకర్ గా తయారు చేశారు. తీరా పార్టీ అధికారం కోల్పోయాకా.. కోడెలను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. కోడెల మీద విమర్శలు - కేసులు పడినప్పుడు.. కనీసం ఆయనను పిలిపించుకుని మానసికంగా ధైర్యం కూడా చెప్పలేదు చంద్రబాబు నాయుడు.

అలాంటిది.. ఇప్పుడు మాత్రం ఎనలేని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇదే చంద్రబాబుపై తెలుగుదేశం పార్టీలో కూడా అసహనాన్ని పెంచుతూ ఉందని పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎంతసేపూ పార్టీ నేతలను  వాడుకోవడమే తప్ప.. వారికి  కష్టం వస్తే  ఆదుకునే తత్వం ఆయనలో కనిపించడం లేదని వారు అంటున్నారు.

పార్టీ ఫెయిల్యూర్  - లోకేష్ నాయకత్వం ఏ మాత్రం సమర్థనీయంగా లేకపోవడంతో.. ఇప్పుడు పార్టీ నాయకత్వం మారితేనే మేలని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ రంగ ప్రవేశం చేయాలని.. వారు కోరుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగానూ విఫలం అవుతున్నారని, ఆయనకు వయసు కూడా మీద పడుతోందని.. ఎన్టీఆర్ ఇప్పుడే రంగంలోకి దిగాలని వారు వ్యాఖ్యానిస్తున్నారు. 
Tags:    

Similar News