వైఎస్ విజయమ్మ లేఖ ఇప్పుడెందుకు రిలీజ్ చేసినట్లు..?

Update: 2021-04-06 10:12 GMT
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ తిరుగులేని శక్తిగా మారింది.  ఒకప్పుడు ఆ పార్టీ అంటే ఎవరూ పట్టించుకోని వారు ఇప్పుడు ఫ్యాన్ పార్టీ చుట్టూ గిరగిరా తిరుగుతున్నారు. అయితే వైసీపీ ఇంతటి  స్థాయికి రావడం వెనుక ఎంతో కష్టం ఉంది. వైఎస్ జగన్ కు తోడుగా తల్లి విజయమ్మ - చెల్లెలు షర్మిల - భార్య భారతి వైఎస్ జగన్ తన పాదయాత్రతో ఎందరినో అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తరువాత వీరి కష్టాన్ని చూసిన ఏపీ ప్రజలు వైసీపికి తిరుగులేని విజయాన్ని తెచ్చిపెట్టారు. దీంతో మొన్న జరిగిన పంచాయతీ- మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎక్కడా తక్కువ కాకుండా మెజారిటీ వైసీపీకి వచ్చింది.

ఇదిలా ఉండగా వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై ఆమె కూతురు సునీత ఇటీవల ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రి హత్యకు గురయ్యాడని, న్యాయం కోసం అన్ని తలుపులు తట్టాను అని చెప్పారు. తాను ఓ సీబీఐ అధికారిని కలిస్తే కడపలో ఇలాంటివి సాధారణమే అని జవాబివ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అలాగే వైసీపీ అభిమానులు కూడా ఈ విషయంలో సీబీఐ ఎంతవరకు నిగ్గు తేల్చిందని ప్రశ్నిస్తున్నారని టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు ప్రశ్నలు సంధిస్తున్నాయి..

ఈక్రమంలోనే వైఎస్ విజయమ్మ బయటకు వచ్చారు. సీఎం జగన్ పై వస్తున్న ఆరోపణలకు విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. విమర్శకులకు తన లేఖ ద్వారా గట్టి సమాధానం ఇచ్చారు. అయితే విజయమ్మ అప్రూవల్ తీసుకొని లెటర్ రాశారా..? లేక ఎవరైనా రాసిచ్చారా..? అని చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఆమె లెటర్ ద్వారా కాకుండా డిటేయిల్ గా చెప్పి ఉంటే బాగుండునని అంటున్నారు. ఇంకా వీలైతే సాక్షి టీవీ ద్వారా చెబితే బాగుండునని అంటున్నారు.

ఏదీ ఏమైనా వైఎస్ విజయమ్మ తన వైసీపీ అభిమానుల కోసం, కుటుంబం కోసం నిలబడుతున్నారని ఈ లేఖ ద్వారా స్పష్టమైందని అంటున్నారు. అయితే సీబీఐ త్వరగా దర్యాప్తు చేసి దోషులను పట్టుకుంటే ప్రజలు ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందని అంటున్నారు. ఇలానే జాప్యం చేస్తే ప్రజల్లో- నేతల్లో అనుమానం ఉండి ఎక్కడపడితే అక్కడ చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా సీబీఐ ఎంత త్వరగా తేల్చుతుందో చూద్దాం..  
Tags:    

Similar News