''వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా వస్తుంది.. అందువల్ల వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలి'' ఇదీ.. నిపుణులు చెప్పేమాట. దీంతో.. ఆ మాత్రం దానికి వ్యాక్సిన్ తీసుకోవడం ఎందుకు అనేవారి సంఖ్య గణనీయంగానే పెరిగింది. నిజానికి.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొవిడ్-19 సోకినప్పుడు ఎందుకు తీసుకోవాలి? అన్న ప్రశ్నలకు తాజా పరిశోధన చెబుతున్న సమాధానం ఏంటో తెలుసుకుందాం.
కొవిడ్ సెకండ్ వేవ్ ప్రపంచంలో ఏ దేశంపై చేయనంత భీకరమైన దాడి ఇండియాపై చేస్తోంది. ఈ దాడికి నిత్యం లక్షలాది మంది మంచాన పడుతుంటే.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. క్షేత్రస్థాయిలో తీసుకునే నివారణ చర్యలు ఎలా ఉన్నా.. ప్రధానమైన వ్యాక్సిన్ సరఫరా మాత్రం సరిగా సాగట్లేదు. దీనికి కారణం.. వ్యాక్సిన్ ఉత్పత్తి నత్తనడకను తలపిస్తుండడమే.
ఇప్పటి వరకూ కనీసం 20 కోట్ల మందికి కూడా వ్యాక్సిన్ ఇవ్వలేదనే వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇందులో ఉపశమనం ఏమంటే.. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వైద్యులు, పోలీసులు, పలు రంగాల ఉద్యోగులకు టీకాలు వేశారు. వీరితోపాటు.. వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇప్పటికే టీకా అందించారు.
అయితే.. టీకా రెండు డోసులు తీసుకున్న వారిలోనూ కొందరు కొవిడ్ బారిన పడ్డారు. కొందరు చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం.. అప్పటికే వారి ఆరోగ్య వ్యవస్థ బాగా దెబ్బతినిపోవడం.. శరీరం వైద్యానికి సహకరించకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయట. అదే సమయంలో.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలా మంది తక్కువ కాలంలోనే సురక్షితంగా బయటపడుతున్న విషయాన్ని నిపుణులు గుర్తించారట.
ఉత్తర ప్రదేశ్ లో చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకుని, కొవిడ్ బారిన పడిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారని, మిగిలిన వారంతా మూడ్నాలుగు రోజుల్లో క్షేమంగా ఇల్లు చేరుతున్నారని తేలిందట.
వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల.. శరీర భాగాలపై వ్యాక్సిన్ చేసే దాడి తీవ్రత తగ్గుతుందని చెబుతున్నారు. తద్వారా సున్నితమైన అవయవాలు వైరస్ బారి నుంచి రక్షణ పొందుతాయని, దానివల్ల ప్రాణాపాయం తప్పుతుందని అంటున్నారు. అందువల్ల.. వైరస్ వచ్చే అవకాశం ఉన్నా.. వ్యాక్సిన్ తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.