మంత్రి అంబ‌టికి చుక్క‌లు చూపించిన విద్యార్థులు

Update: 2023-01-09 11:30 GMT
ఏపీలో అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని ఎవ‌రైనా అంటే.. వెంట‌నే ప్ర‌తిప‌క్షాల కుట్ర అంటూ.. పెద్ద ఎత్తున యాగీ చేసే వైసీపీ నాయ‌కులు, మంత్రులు.. ఎదురు దాడి చేయ‌డం లేదా అవ‌స‌రం అయితే..కేసులు కూడా పెట్టిస్తున్నారు. అయితే.. ఇప్పుడు  మంత్రి అంబటి రాంబాబుకు అనూహ్య‌మైన స‌మ‌స్య ఏర్ప‌డింది. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో విద్యార్థులు ఆయ‌న‌ను నిల‌దీశారు.

రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడంపై విద్యార్థులు నిలదీశారు తాజాగా ఓ విద్యార్థిని మంత్రి అంబటి రాంబాబును ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి అమ్మఒడి వస్తోందా.. అని మంత్రి.. విద్యార్థినిని అడిగారు. దానికి సమాధానంగా.. 'అమ్మఒడి సరే.. అభివృద్ధి ఏదీ? అమరావతిలో రాజధానిని ఎందుకు నిర్మించడం లేదు' అని డిగ్రీ విద్యార్థిని మంత్రిని ప్రశ్నించింది.

ఊహించని ఈ ప్రశ్నలకు ఆమెను సమాధానపర్చలేక.. బాగా చదువుకోవాలంటూ అక్కడి నుంచి వెళ్లిపో యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని 15వ వార్డులో 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో మంత్రితో విద్యార్థిని పిట్టల ప్రవళిక సంభాషణ చర్చనీయాంశమైంది. వాస్త‌వానికి గ‌తంలోనూ అంబ‌టి నిర్వ హించిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు యువ‌కులు కూడా ఇదే ప్ర‌శ్న సంధించారు.

అయితే.. అప్ప‌ట్లో ఈ యువ‌త‌ను క‌మ్యూనిస్టులుగా.. టీడీపీ నాయ‌కులుగా అభివ‌ర్ణించిన అంబ‌టి.. ఇప్పు డు విద్యార్థిని ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పుకోలేక పోయారు. ఈ ప‌రిస్థితి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నిపిస్తుండ డం గ‌మ‌నార్హం.  ఎంత పింఛ‌న్లు ఇస్తున్నా.. ఎన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తున్నా.. అభివృద్ధి లేక‌పోవ‌డం మాకుఇబ్బందిగానే ఉంద‌ని..ఎమ్మెల్యేలు ఆఫ్ దిరికార్డుగా వాపోతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News