వైజాగ్ టెస్ట్‌లో స‌రికొత్త వ‌ర‌ల్డ్ రికార్డులు

Update: 2019-10-06 15:12 GMT
భార‌త్ - ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య వైజాగ్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించింది. 203 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్ల‌ను కేవ‌లం 191 ప‌రుగుల‌కే ఆల‌వుట్ చేసి ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆదివారం ఆట‌లో భార‌త బౌల‌ర్లు చెల‌రేగి ద‌క్షిణాఫ్రికాను కేవ‌లం 191 ప‌రుగుల‌కే చుట్టేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 502/7 డిక్లేర్డ్‌, రెండో ఇన్నింగ్స్‌ 323/4 డిక్లేర్డ్ చేసింది. ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 431 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 191 ఆలౌట్ అయ్యింది.

ఈ మ్యాచ్ ప‌లు రికార్డుల‌కు వేదిక‌గా నిలిచింది. ఓపెన‌ర్‌గా తొలి టెస్ట్‌లోనే రోహిత్‌శ‌ర్మ రెండు ఇన్సింగ్స్‌ల‌లో సెంచ‌రీలు చేసిన ఏకైక ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఆట‌గాడికి ఈ అరుదైన రికార్డు లేదు. భారత్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 350వ టెస్టు వికెట్లను 66వ టెస్టులోనే సాధించి అత్యంత వేగవంతంగా ఆ ఘనతను అందుకున్న జాబితాలో ముత్తయ్య మురళీ ధరన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ రెండు వ‌ర‌ల్డ్ రికార్డులే.

ఇక ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ పీయుడ్త్ 10వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచ‌రీ కొట్ట‌డం ద్వారా భార‌త్‌పై ఆ ఘ‌నత సాధించిన తొలి స‌ఫారీ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలాగే సిక్స‌ర్ల రికార్డు కూడా ఇక్క‌డ న‌మోదైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు క‌లిపి మొత్తం 37 సిక్స‌ర్లు సాధించాయి. ఈ క్ర‌మంలోనే ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఎక్కువ సిక్సులు న‌మోదైన మ్యాచ్‌గా ఇది రికార్డుల‌కు ఎక్కింది. 2014-15  సీజన్‌లో పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన టెస్టులో 35 సిక్సర్లు రికార్డు ఇప్పటివరకూ టాప్‌ ప్లేస్‌లో ఉంది.

భారత్‌ తన తొలి ఇన‍్నింగ్స్‌లో 13 సిక్సర్లు.. రెండో ఇన్సింగ్స్‌లో 14 సిక్స‌ర్లు సాధించింది. ఇక ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్సింగ్స్‌లో 7, రెండో ఇన్సింగ్స్‌లో 3 సిక్స‌ర్లు సాధించింది. రవీంద్ర జడేజా వేసిన 35 ఓవర్‌లో పీయడ్త్‌ సిక్స్‌ను కొట్టడం ద్వారా పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ల పేరిట ఉన్న 35 సిక‍్సర్ల రికార్డు బద్ధలైంది. ఏదేమైనా వైజాగ్ టెస్ట్‌లో భార‌త్ విజ‌యం సాధించ‌డంతో పాటు ప‌లు వ‌ర‌ల్డ్ రికార్డులు బ్రేక్ అయ్యాయి.
Tags:    

Similar News