ఎర్రచందనం స్మగ్లర్లు తెలివి మీరారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయడానికి అనేక ఎత్తుగడలు వేస్తుంటాడు. పోలీసుల నుంచి చాకచక్యంగా ఎర్రచందనాన్ని అడవి దాటిస్తుంటాడు. ఇప్పుడు దీన్ని మించిపోయి ఆంధ్రప్రదేశ్ లో రాయసీమలోని స్మగ్లర్ల వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు భిన్న వ్యూహాలతో, పథకాలతో ఎర్రచందనం దుంగలను అనుకున్న చోటుకి చేరవేస్తున్నారు. అయితే పోలీసులు కూడా డేగ కళ్లతో వారి వ్యూహాలకు చెక్ పెడుతున్నారు.
తాజాగా అంబులెన్సులో రోగిని ఎక్కించుకుని వెళుతున్నట్టు నటిస్తూ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఏపీలోని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఆటోతో నీళ్ల క్యాన్లు సరఫరా చేసే ముసుగులో ఎర్ర దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న మరో ముఠాకు చెక్ పెట్టి అరెస్టు చేశారు.
ఈ వివరాలను చిత్తూరు ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో ఎస్పీ రిషాంత్‌రెడ్డి మీడియాకు తెలిపారు. చిత్తూరు మీదుగా తమిళనాడులోని వేలూరుకు రోజూ వందల సంఖ్యలో అంబులెన్సులు వెళుతుంటాయి. వాటిలో రోగులను తీసుకెళుతున్నట్టుగా డ్రామాలాడుతూ.. రోగి సహాయకుల వేషంలో స్మగ్లర్లు రోజూ శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనాన్ని తీసుకెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో చిత్తూరు తూర్పు సీఐ బాలయ్య, ఎస్‌ఐ రామకృష్ణలు సిబ్బందితో కలిసి చిత్తూరు-వేలూరు రోడ్డులోని మాపాక్షి వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ అటుగా వస్తున్న అంబులెన్సునూ తనిఖీ చేశారు.
అంబులెన్సులో మొత్తం 15 మంది ఉన్నారు. తనిఖీలు చేస్తుండగా నలుగురు పారిపోయారు. మిగిలిన వాళ్లను కిందకి దింపి వాహనాన్ని తనిఖీ చేయగా.. 36 ఎర్రచందనం దుంగలు, చెట్లను నరికే గొడ్డళ్లు, కత్తులు దొరికాయి. నిందితులంతా తమిళనాడుకు చెందినవారేనని ఎస్పీ తెలిపారు.
అదేవిధంగా చిత్తూరులో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై పోలీసుల వాహన తనిఖీల్లో నీళ్ల క్యాన్లు సరఫరా చేసే ఆటోను తనిఖీ చేయగా 35 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఈ కేసులో చెన్నైకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ రెండు కేసుల్లో పట్టుబడ్డ వాహనాలు, ఎర్రచందనం దుంగల విలువ రూ.కోటి వరకు ఉంటుందని ఎస్పీ వివరించారు.