ఫోర్బ్స్‌... బెస్ట్‌ ఎంప్లాయర్‌ ర్యాంకింగ్స్‌లో రిల‌య‌న్స్‌కు చోటు!

Update: 2021-10-15 01:30 GMT
`ఫోర్బ్స్`... అమెరికాకు చెందిన బిజినెస్ మ్యాగ‌జీన్‌. `వేల్ మీడియా`కు చెందిన ఈ ఫోర్బ్స్ ఏడాదికి 8 మేగ‌జీన్స్ మాత్ర‌మే తీసుకువ‌స్తుంది. అయితే.. ఈ మ్యాగ‌జీన్ తీసుకువ‌చ్చే సంచ‌ల‌న వార్త‌ల‌కు ఎప్పుడు.. ఇంట్ర‌స్టింగ్ ఉంటుంది. ఏటా అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌డంతోపాటు.. ప‌లు కీల‌క విష‌యాల్లో.. అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తుంది. ర్యాంకుల‌ను కూడా ఇస్తుంది. ఫోర్బ్స్ ప‌త్రిక‌లో త‌మ ఫొటో రావ‌డం.. తమ గురించి రాయ‌డం.. వంటి వాటిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటారు.

ఇది ప్ర‌తిష్టాత్మ‌కం!!

ఈ క్ర‌మంలోనే తాజాగా 2021కి సంబంధించి ఉద్యోగుల విష‌యంలో కంపెనీలు ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తు న్నాయ‌నే అంశంపై ఫోర్బ్స్ స‌ర్వే చేసి.. ఫ‌లితాల‌ను  వెల్ల‌డించింది. దీనిలో రిలయన్స్‌ సంస్థకి అరుదైన గౌరవం దక్కింది. 2021 ఏడాదికి గాను ఫో‍ర్బ్స్‌ సంస్థ ప్రకటించిన బెస్ట్‌ ఎంప్లాయర్‌ ర్యాకింగ్స్‌లో రిల‌యన్స్‌ 52వ స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 750 కంపెనీలను ఈ ర్యాంకింగ్స్‌ కోసం పరిశీలించగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ సంస్థ 52వ స్థానంలో నిలిచింది.  

శామ్‌సంగ్‌కు ఫ‌స్ట్ ప్లేస్‌..

 ప్రపంచ వ్యాప్తంగా ఫోర్బ్స్ ప్ర‌క‌టించిన‌ ర్యాంకులను పరిశీలిస్తే ద‌క్షిణ కొరియాకు చెందిన‌ శామ్‌సంగ్‌ సంస్థ ప్రథమ స్థానంలో నిలవగా ఐబీఎం కంప్యూటర్స్‌ ద్వితీయ స్థానం దక్కించుకుంది. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, యాపిల్‌, గూగుల్‌, డెల్‌, హువావేలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా 58 దేశాలకు చెందిన 750 కంపెనీల నుంచి 1,50,000ల మంది ఫుల్‌టైం, పార్ట్‌టైం ఉద్యోగుల నుంచి ఈ అభిప్రాయాలను సేకరించి ఫోర్బ్స్‌ ఈ జాబితాను రూపొందించింది.

వేత‌నాలు.. స‌మాన‌త్వమే ప్రాతిప‌దిక‌!

ఫోర్బ్స్ స‌ర్వేలో.. ప‌లు కీల‌క అంశాల‌నుప్ర‌స్తావించింది. ఉద్యోగుల నుంచి కంపెనీ ఆర్థిక ప్రణాళిక, లింగ సమానత్వం, సామాజిక బాధ్యత, టాలెంట్‌ డెవలప్‌మెంట్‌ తదితర అంశాలపై  దృష్టి పెట్టింది. కంపెనీల్లో లింగ స‌మాన‌త్వం.. మ‌హిళ‌ల‌కు క‌ల్పిస్తున్న అవ‌కాశాలు.. వేత‌నాలు.. ఇస్తున్న తీరు.. స‌హా.. సెల‌వులు.. వంటి కీల‌క విష‌యాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది.

భార‌త్ నుంచి 100లోపు 4 కంపెనీల‌కే చోటు..

ఫోర్బ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్‌ అవార్డులకు సంబంధించి టాప్‌ 100 జాబితాలో మొత్తం నాలుగు సంస్థలకే చోటు దక్కింది. అందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 52వ స్థానంలో నిలవగా ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్‌ 65వ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 77, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 90 ర్యాంకును దక్కించుకున్నాయి. ప్రతిష్టాత్మక ఎస్‌బీఐ 117వ, ఎల్‌ అండ్‌ టీ 127వ స్థానాలకే పరిమితం అయ్యాయి.  ఫోర్బ్స్‌ బెస్ట్ఎంప్లాయర్‌ ర్యాకింగ్స్‌లో చోటు దక్కించుకున్న ఇతర భారతీయ కంపెనీల విషయానికి వస్తే బజాజ్‌ 215, యాక్సిస్‌ బ్యాంక్‌ 215, ఇండియన్‌ బ్యాంక్‌ 314, ఓన్ఎన్‌జీసీ 404, అమర్‌రాజా గ్రూపు 405,  కోటక్‌ మహీంద్రా 415, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 451, ఐటీసీ 453, సిప్లా 460, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 496, ఎల్ఐసీ 504, ఇన్ఫోసిస్‌ 588, టాటా గ్రూపు 746వ స్థానాలు దక్కించుకున్నాయి.
Tags:    

Similar News