స్టాలిన్ కాన్సెప్ట్ కు రిలయన్స్ మార్క్ బిజినెస్ ఐడియా

Update: 2016-05-14 05:15 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో స్టాలిన్ కాస్త భిన్నమైంది. సోషల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలోని కాన్సెప్ట్ పలువురిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. వాణిజ్యపరంగా ఈ సినిమా అంత విజయవంతం కాకున్నా.. ఈ సినిమాలోని సందేశానికి చాలామంది స్పూర్తి పొందారు. మరి స్టాలిన్ సినిమాలోని కాన్సెప్ట్ కు ప్రభావితం అయ్యారో లేదో కానీ.. దాదాపు అలాంటి అంశాన్ని రిలయన్స్ సంస్థ తనదైన బిజినెస్ ఐడియాగా మార్చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాకుంటే స్టాలిన్ లోని కాన్సెప్ట్ ను యథాతధంగా కాకుండా అందులో కొంత భాగాన్ని మాత్రమే రిలయన్స్ తీసుకున్నట్లు కనిపిస్తుంది.

కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త సంచలనంగా అభివర్ణిస్తూ.. డేటా వినియోగంలో సరికొత్త అనుభూతిని కల్పింస్తుందంటూ ప్రఖ్యాత రిలయన్స్ కంపెనీకి చెందిన జియో మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఒక్కసారి మార్కెట్లోకి రిలయన్స్ జియో కానీ అడుగు పెడితే.. ఇప్పటివరకూ ఉన్న డేటా వినియోగం రూపురేఖలు మారిపోవటమే కాదు.. దాని వేగం ముందు మిగిలిన కంపెనీలు నోరెళ్లబెట్టటమే కాదు.. అతిత్వరలోనే బ్రాండ్ లీడర్ అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్లో భారీగా వినిపిస్తాయి.

రిలయన్స్ జియోను మిగిలిన ఉత్పత్తుల మాదిరి నేరుగా మార్కెట్లోకి తీసుకురాకుండా సరికొత్త ఆఫర్ ను తెరపైకి తీసుకొచ్చి ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది రిలయన్స్. ఒక విధంగా చెప్పాలంటే ఎండ్ కస్టమర్ లో భారీ మౌత్ పబ్లిసిటీకి అవకాశం ఇచ్చే బిజినెస్ ఐడియాగా దీన్ని చెప్పాలి. ఇంతకీ ఈ ఐడియా ఏమిటంటే.. రిలయన్స్ 4జీ స్మార్ట్ ఫోన్.. మూడు నెలల అన్ లిమిటెడ్ డేటా.. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ను కేవలం రూ.4,799లకే పొందచ్చు. ఈ ఆఫర్ వినగానే.. జియో ఫోన్ ఎక్కడ దొరుకుతుందన్న ప్రశ్న మదిలో మెదులుతుంది.

ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఈ జియో ఫోన్ ను ఈ ఆఫర్లో సొంతం చేసుకోవాలంటూ ఒకేఒక్క మార్గం ఉంది. అదేమంటే.. మీకు ఎవరైనా రిలయన్స్ ఉద్యోగి పరిచయం అయి ఉండాలి. వారి నుంచి మీరు ఒక ఎస్ ఎంఎస్ తెప్పించుకోగలిగితే ఈ బంపర్ ఆఫర్ మీకు సొంతం అవుతుంది. జియోను పరిమిత కస్టమర్లకు అందించి... దాని ద్వారా ఆసక్తిని పెంచి జియోను భారీగా మార్కెట్ లోకి లాంఛ్ చేయాలన్న ఆలోచనలో రిలయన్స్ ఉందని చెబుతున్నారు. ఒక రిలయన్స్ ఉద్యోగి తనకు తెలిసిన 10 మందికి ఇలాంటి ఆఫర్ ను అందించే అవకాశం ఉంది. మరిక ఆలస్యం ఎందుకు.. రిలయన్స్ కంపెనీలో పని చేసే ఫ్రెండ్ ఎవరైనా మీకు ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించండి.
Tags:    

Similar News