ఆసక్తికర వ్యాపార యుద్ధానికి తెర లేవనుంది. రెండు కార్పొరేట్ సంస్థలు కన్నేసిన క్రికెట్ ప్రసార హక్కుల వ్యవహారం రానున్న రోజుల్లో మరింత హాట్ పోటీకి దారి తీయనుంది. ఇప్పటివరకు లేని కొత్త ప్రాధాన్యతను దేశీయ తోపు కార్పొరేట్ సంస్థ రిలయన్స్ కన్నేయగా.. దానికి పోటీగా అంతర్జాతీయంగా తాను కోరుకున్నది సొంతం చేసుకోవటానికి దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించే అమెజాన్ బరిలోకి దిగనుంది.
దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఎంతో తెలిసిందే. పరిమితంగా ఉండే క్రికెట్ పోటీలు.. ఐపీఎల్ సీజన్ పుణ్యమా అని.. నెలల తరబడి సాగటమే కాదు.. గతంతో పోలిస్తే ఎక్కువ క్రికెట్ షెడ్యూల్ ఇప్పుడు నడుస్తోంది. ఈ పోటీల్ని వీక్షించే కోట్లాది మందితో కూడిన ప్రసార హక్కుల వ్యాపారంలో తమ అధిక్యతను ప్రదర్శించాలని భావిస్తోంది. ఇందుకోసం రిలయన్స్ వర్సస్ అమెజాన్ మధ్య పోటీకి తెర లేచింది.
ఇప్పటికే ఫ్యూచర్ గ్రూప్ బిగ్ బజార్ రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవటానికి ఈ రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా దేశీయ క్రికెట్ హక్కుల్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఈ రెండు సంస్థలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఇందుకోసం అవసరమైతే రూ.50వేల కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు దేశీయ క్రికెట్ పోటీల్ని ప్రసారం చేస్తున్నాయి సాంప్రదాయ మీడియా సంస్థలైన సోని గ్రూప్ కార్పొరేషన్ తో పాటు వాల్ట్ డిస్నీ కో భారత విభాగం.
ప్రపంచంలోనే వీక్షకులు.. అభిమానుల పరంగా రెండో స్థానంలో ఉండే క్రికెట్ ప్రసారాలు ఉండటంతో కార్పొరేట్ పోటీకి తెర లేచింది. ఈ కొత్త పోటీ నేపథ్యంలో ప్రసార హక్కుల వేలం భారీగా పెరగనుందని చెబుతున్నారు.
క్రికెట్ లైవ్ స్టీమింగ్ తమ చేతికి వస్తే.. తమ నెట్ వర్కును మరింత విస్త్రతం చేసుకోవాలని భావిస్తున్న ఈ రెండు సంస్థల్లో విజయం సాధించేదెవరు? అన్నది అసలు ప్రశ్న. మరి.. ఈ ప్రసార హక్కుల వార్ లో విజయం సాధించేది అంబానీనా? జెఫ్ బెజెస్ అన్నది కాలమే తేల్చాలి.