బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తమ పేర్లు మార్పు ప్రక్రియను కొనసాగిస్తున్నది. తాజాగా అండమాన్ దీవుల్లో మూడింటి పేర్లను మార్చాలని నిర్ణయించింది. హావ్‌లాక్ దీవిని స్వరాజ్ ద్వీప్ గా, నీల్ ఐలాండ్ ను షహీద్ ద్వీప్ గా, రాస్ ఐలాండ్ ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా పేర్లు మార్చారు. అండమాన్ దీవుల్లో నేతాజీ చారిత్రక పర్యటనకు 75 ఏళ్లు గడిచిన సందర్భంగా అక్కడికి వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఈ పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ పేర్లకు ఇప్పటికే హోంశాఖ ఆమోదం తెలిపింది.
1943, డిసెంబర్ 30న పోర్ట్ బ్లెయిర్ లోని జింఖానా గ్రౌండ్ లో నేతాజీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తొలి భారత భూభాగం ఈ అండమాన్ దీవులే అని నేతాజీ ఆ రోజు ప్రకటించారు. ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జపనీయులు ఈ దీవులను ఆక్రమించుకున్నారు. అప్పుడు అండమాన్ దీవికి షహీద్ అని, నికోబార్ దీవికి స్వరాజ్ అని నేతాజీ పేర్లు మార్చారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన నేతాజీ బంధువు, బీజేపీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ బోస్ ఆ పేర్లను పునరుద్ధరించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నెల రోజుల తర్వాత మోదీ సర్కార్ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.