ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? వచ్చేందుకు అవకాశం ఉందా? వస్తే.. ఎవరు గెలుస్తారు? అధికా ర పార్టీ వైసీపీ ఏం చేస్తుంది? ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎలా ముందుకు సాగుతుంది? అదేవిధంగా పవన్ నేతృత్వంలోని జనసేన ఎలాంటి వ్యూహం వేస్తుంది? ఇవీ.. ఇప్పుడు ఏపీ రాజకీయాలపై హాట్ హాట్‌గా సాగుతున్న చర్చలు. ఈ క్రమంలో రాజకీయ మేధావుల అంచనా ప్రకారం.. ఉమ్మడి ఏపీలో 2009లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుసరించిన ఫార్ములానే ఇప్పుడు ఆయన కుమారుడు, సీఎం జగన్ అనుసరిస్తారని చెబుతున్నారు.
2009 నాటి వ్యూహం చూసుకుంటే.. 2004కు ఎన్నికలకు ముందు.. వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ను అధికా రంలోకి తీసుకువచ్చేందుకు పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో ఆయన భారీ మెజారిటీతో అధికారం దక్కిం చుకున్నారు. అయితే.. తర్వాత.. వచ్చిన 2009 ఎన్నికలకు వచ్చే సరికి వైఎస్ చేపట్టి.. ఆరోగ్య శ్రీ సహా పింఛన్ల పెంపు(75 నుంచి 200) వంటివి బాగా వర్కవుట్ అయ్యాయి. దీనికితోడు వర్షాలు రావడంతో రైతాంగం ఆనందంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ను ఓడించడం.. ప్రతిపక్షాలకు ఒకింత ఇబ్బంది తప్పదనే అంచనాలు వచ్చాయి.
దీంతో అప్పటి పార్టీలు.. టీడీపీ, టీఆర్ ఎస్, కమ్యూనిస్టులు.. సహా .. కొన్ని చిన్నా చితకా పార్టీలు అన్నీ.. మహాకూటమిగా జతకట్టి.. వైఎస్‌పై పోరు కు దిగాయి. అయినప్పటికీ.. వైఎస్ తన పథకాలతో విజయం దక్కించుకున్నారు. ఈ పరిణామం.. అంటే.. అన్ని పార్టీలూ కట్టకట్టుకుని వైఎస్‌పై పోటీ చేసినా.. ఆయన ను ఓడించలేక పోయారనే వాదన బలంగా ప్రజల్లోకి వెళ్లి.. రాజకీయంగా కూడా రికార్డు సృష్టించింది. కట్ చేస్తే.. ఇప్పుడు మళ్లీ సేమ్ సీన్ .. నవ్యాంధ్రలో కనిపించేందుకు రెడీ అఅయిందని అంటున్నారు పరిశీలకులు.
గత 2014 ఎన్నికలకు ముందు వైఎస్ తనయుడు, వైసీపీ అధినేత జగన్.. పాదయాత్ర చేసి .. ప్రజల్లో సింపతీ కొట్టేశారు. తద్వారా.. భారీ మెజారిటీతో అధికారం దక్కించుకున్నారు. ఇక, ఆయన చేస్తున్న సంక్షేమం కావొచ్చు.. ఇతర పథకాలు కావొచ్చు.. ఇప్పటి వరకు జరిగిన స్థానిక, కార్పొరేషన్, పరిషత్, తిరుపతి ఉప ఎన్నికలను చూసుకుంటే.. ప్రతిపక్షాలు.. సోదిలో కూడా లేకుండా పోయాయి. ఈ నేపథ్యం లో వచ్చే ఎన్నికల నాటికి.. జగన్‌ను ఓడించాలంటే.. ఎవరికివారు ఒంటరిగా పోటీ చేయడం సరైన విధానం కాదనే అభిప్రాయం.. ప్రధాన ప్రతిపక్షాల మధ్య చక్కర్లు కొడుతోంది.
వాస్తవానికి టీడీపీని తీసుకుంటే.. 2014లో తప్ప.. గతంలో ఎప్పుడూ.. ఒంటరిగా పోటీ చేసింది లేదు. గెలి చినా.. ఓడినా.. ఎవరో ఒకరు తోడు ఉండేవారు. అయితే.. 2014లో అందరినీ కాదని.. టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. దీంతో ఓడిపోయింది. ఇక, జనసేన బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి రంగంలోకి దిగినా.. కేవలం ఒక్కటంటే ఒక్క సీటు తప్ప.. సాధించింది ఏమీలేదు. ఇక, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కూడా ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర విభజన ఎఫెక్ట్ కాంగ్రెస్‌ను వెంటాడుతుండగా.. విభజన హామీలను అమలు చేయలేదనే పాపం.. బీజేపీకి శాపంగా మారింది.
సో.. ఈ రెండు పార్టీలు ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో.. జగన్‌ను ఓడించాంటే.. టీడీపీ, జనసేన బీజేపీ లేదా కాంగ్రెస్‌లు కలసి పోటీ చేసేలా వ్యూహాత్మకంగా తెరచాటు మంతనాలు సాగుతు న్నాయని అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. తాము మాత్రం ఒంటరిగానే బరిలో దిగుతామనేది వైసీపీ నేతల మాట. తమ పథకాలు, సంక్షేమం, జగన్ ఇమేజ్ తమకు కొండంత అండ అని చెబుతున్నారు. దీంతో నవ్యాంధ్రలో తిరిగి 2009 వైఎస్ సీన్ రిపీట్ కావడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.