48 గంట‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా నెట్ క‌ష్టాలేనా?

Update: 2018-10-13 07:31 GMT
మీ చేతుల్లో ఫోన్ లేకుంటే..?  ఇదేం ప్ర‌శ్న‌. ఫోన్ లేకుండా అడుగు ముందుకు ప‌డ‌దు క‌దా? స‌రే.. ఫోన్ చేతిలో ఉన్నా ఇంట‌ర్నెట్ లేకుంటే..?  వామ్మో.. అదెలా బాసూ.. క్యాబ్ బుక్ చేసుకోవాల‌న్నా.. ఫుడ్ తెప్పించుకోవాల‌న్నా.. పేటీఎంలో డ‌బ్బులు పంపాల‌న్నా.. అన్నింటికి మించి వాట్సాప్ ద‌రిద్రం లేకుండా రోజు గ‌డిచేనా? అన్న దిగులు రావ‌టం ఖాయం.

ఈ సేవ‌ల‌న్నింటికి అవ‌స‌ర‌మైన ఇంటర్నెట్ కు ఇప్పుడు స‌మ‌స్య వ‌చ్చింది. దీన్ని స‌రి చేయటానికి క‌నీసం 48 గంట‌లు ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ .. రానున్న 48 గంట‌ల్లో వాతావ‌ర‌ణం ఇలా ఉండ‌నుంద‌న్న హెచ్చ‌రిక‌లు విని ఉంటాం. ఇప్పుడు అలాంటి త‌ర‌హాలోనే ఇంట‌ర్నెట్ హెచ్చ‌రిక ఒక‌టి విడుద‌లైంది. ప్ర‌పంచం మొత్తానికి ఇంట‌ర్నెట్ వార్నింగ్ ఒక‌టి విడుద‌లైంది. ఇంట‌ర్నెట్‌కు సంబంధించిన పేర్లు.. ఐపీ అడ్ర‌స్ ల‌ను నియంత్రించే ది ఇంట‌ర్నెట్ కార్పొరేష‌న్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబ‌ర్స్ కు సంబంధించిన భ‌ద్ర‌త‌ను మ‌రింత పెంచేందుకు వీలుగా ఇంట‌ర్నెట్ క్రిఫ్టోగ్ర‌ఫిక్ కీని మారుస్తున్నారు.

ఈ మార్పున‌కు 48 గంట‌ల స‌మ‌యం పడుతుంది. అప్ప‌టివ‌ర‌కూ ఇంట‌ర్నెట్ నెమ్మ‌దిగా ఉండ‌టం.. వెబ్ పేజీలు త్వ‌ర‌గా ఓపెన్ కాక‌పోవ‌టంతోపాటు.. ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ లేద‌ని చూపించ‌టంలాంటి స‌మ‌స్య‌లు చోటు చేసుకుంటాయ‌ని చెబుతున్నారు. డొమెయిన్ నేమ్ సిస్టం ర‌క్ష‌ణ‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేసేందుకు తాజాగా చేస్తున్న మార్పులు సాయం చేస్తాయ‌ని చెబుతున్నారు.

త‌ప్ప‌నిస‌రి ప‌రిస్తితుల్లోనే ఈ మార్పును చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. రానున్న 48 గంట‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఇంట‌ర్నెట్ యూజ‌ర్స్ కు ఇబ్బందులు త‌ప్ప‌వంటున్నారు.ఇదిలా ఉంటే.. అంత స‌మ‌స్య ఏమీ ఉండ‌ద‌ని.. 99 శాతం మంది ఇంట‌ర్నెట్ యూజ‌ర్ల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండానే చూస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఒక‌వేళ‌.. అదే జ‌రిగితే అద్భుత‌మంటున్నారు. ఒక‌వేళ‌.. అలాకాకున్నా.. 48 గంట‌ల పాటు స‌మ‌స్య‌ను భ‌రించాల్సిందే.  అనుకుంటాం కానీ.. ఇలాంటి స‌మ‌స్య‌లు అప్పుడ‌ప్పుడు తెర మీద‌కు వ‌స్తే కానీ మ‌న‌కున్న బ‌లం ఎంత‌న్న‌ది అర్థ‌మ‌వుతుంది.

క‌రెంటు లేక‌పోతే బ‌త‌క‌లేం అనుకునేవాళ్లు.. ప్ర‌కృతి వైప‌రీత్యాలు విరుచుకుప‌డిన‌ప్పుడు బ‌తికేస్తారు. అలానే..ఇంట‌ర్నెట్ కూడా. సౌక‌ర్యం లేద‌న్న భ‌యం త‌ప్పించి.. ఇంట‌ర్నెట్ లేకున్నా హాయిగా బ‌తికేయొచ్చు. అదెలానో.. రానున్న 48 గంట‌ల్లో చాలా మందికి అనుభ‌వంలోకి రానుందంటున్నారు. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?
Tags:    

Similar News