ఇటీవల కాలంలో ఎప్పుడూ చోటు చేసుకోని ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ తాజాగా ఒక వివాదాస్పద తీర్మానాన్ని చేసింది. దీని గురించి విన్నంతనే సామాన్యుల నోట.. ‘ఏం పోయే కాలం వచ్చింది.. ఇలా చేసి చచ్చారు’ అనుకోవటం ఖాయం. ఫిబ్రవరి ఐదో తేదీని కశ్మీర్ అమెరికన్ డేగా ప్రకటించాలన్న తీర్మానాన్ని చేశారు. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యులు నాదర్ సయేగ్ తో పాటు.. మరో పన్నెండు మంది సభ్యులు కలిసి ఈ తీర్మానాన్ని చేశారు.
కశ్మీరీ ప్రజల మత.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తదితర మానవహక్కుల్ని కల్పించటానికి న్యూయార్క్ ప్రయత్నిస్తుందని చెబుతున్నారు. న్యూయార్క్ వలసవాదులందరిలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కశ్మీరీ సమాజానికి దన్నుగా ఈ తీర్మానం చేసినట్లుగా చెబుతున్నారు. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.
అమెరికా మాదిరే భారత్ కూడా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని.. భిన్నమైన సంస్క్రతికి నిదర్శనమని పేర్కొనటమే కాదు.. భారత్ లో జమ్ము-కశ్మీర్ అంతర్భామని వాషింగ్టన్ లోని భారత దౌత్యకార్యాలయ ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. జమ్ము-కశ్మీర్ సామాజిక స్థితిని.. సంస్క్రతిని తప్పుగా చూపించే ప్రయత్నంగా పేర్కొన్నారు.
ప్రజలను విడదీసే స్వార్థ ప్రయోజనాలతో చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుల్్ని కలిసి.. ఇరు దేశాల సత్ సంబంధాలపై చర్చిస్తామన్నారు. కశ్మీర్ అంశంపై న్యూయార్క్ అసెంబ్లీకి ఉన్నట్లుండి ఈ తరహా వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకోవటానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. రానున్న రోజుల్లో ఈ అంశంపై కేంద్రం ఘాటుగా రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి.. కేంద్రం ఈ అంశంపై ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.