గిఫ్టులు ఉన్నవి మీరూ మీరూ ఇచ్చుకోవడానికేనా. మధ్యలో జనమేం పాపం చేశారు. వారికి కూడా ఏదో ఒక గిఫ్టు ఇవ్వాలి కదా. అంటే ఆ గిఫ్టులు వేరుట. అవి రాజకీయ ప్రతీకార గిఫ్టులుట. అందుకే వారికి వీరూ వీరికి వారూ ఇచ్చుకుంటూ పోతారుట. వారు వస్తే వీరి మీద కేసులు, వీరు వస్తే వారి మీద కేసులు ఇలా పెట్టుకుంటారట. మరి మధ్యలో ప్రజలు ఏం చేయాలీ అంటే అధికారం అనే ఆయుధం వారికి ఇవ్వాలిట.
మరి అధికారం అప్పగించిన జనాలకు ఏమైనా గిఫ్టులు మంచివి ఇస్తారా అంటే ఏమో ఇస్తారో లేదో తెలియదు కానీ ఇప్పటి దాకా చూస్తే ఆ ఊసే లేదుగా. టీడీపీ గత మూడేళ్ళుగా ఒకే పాట పాడుతోంది మేము అధికారంలోకి వస్తే వైసీపీకి ఇంతకు ఇంతా చెల్లిస్తామని. ఆ చెల్లించేది ఏంటో వారికీ వీరికే ఎరుక.
ఇక ఆ మధ్యన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే కాస్తా హుషార్ చేసి మరీ ప్రతీ పోలీస్ స్టేషన్ వంతున లెక్క చూసి మరీ ప్రత్యర్ధుల మీద కేసులు పెడతమని హెచ్చరించారు. అంటే టీడీపీకి అర్జంటుగా అధికారం ఇస్తే వైసీపీ మీద కేసులు పెడతారు అన్న మాట.
ఇదే మాటను చినబాబు లోకేష్ కూడా ఇప్పటికి చాలా సార్లు గట్టిగానే అంటూ వచ్చారు. మా తాత ఎన్టీయార్ రాముడు, మా నాన్న చంద్రబాబు మంచివాడు, నేను మాత్రం ఆ టైప్ కాదు, ఈ రోజు వైసీపీ నేతలు అధికారం అడ్డం పెట్టుకుని ఏమేమి చేశారో వాటికి రెట్టింపు వడ్డీలతో సహా చెల్లిస్తామని లోకేష్ బిగ్ సౌండ్ చేశారు.
అంతే కాదు, అప్పటికి మాజీలయ్యే వైసీపీ నేతలు అంతా అమెరికా వెళ్ళినా మరో చోట దాక్కున్నా కూడా వారిని పట్టుకుని వచ్చి మరీ గట్టిగానే లెక్క సరిచేసి పెడతామని కూడా లోకేష్ టైప్ వార్నింగ్ ఇచ్చేశారు.
మరి ఇదే ముచ్చట అప్పట్లో వైసీపీ నేతలు చెప్పి ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే అసలు వడ్డీ చెల్లిస్తామని నాడు చెప్పిన వైసీపీ నేతలు మూడేళ్ళుగా అదే పనిలో ఉన్నారు. ఇలా రాజకీయ ప్రతీకారమే తమ పవర్ ఫుల్ అజెండా అని ఏ మాత్రం జంకూ గొంకూ చెప్పేసుకుంటున్న ఘనాపాటీ పార్టీల మ్యానిఫేస్టోలో ఏ అడుగున అయినా ఎక్కడైనా ప్రజా సంక్షేమం అన్న పాయింట్ ఏమైనా ఉందా లేదా అన్నదే జనాలు ఇపుడు వెతుకుతున్నారు.
అధికారం జనాలు ఇవ్వాలి, ప్రజాస్వామ్యంలో వారే అసలైన ప్రభువులు. కానీ ఇదంతా పేరుకే. ఇదంతా ఉత్తదే. అసలు అధికారం మాది, మేమే రాజులం మేమే అంతా అని అటూ ఇటూ తొడ కొడుతున్న నేతాశ్రీల మధ్య ప్రజల పాట్లు, బాధలు ఏమైనా వినే వారున్నారా. అసలు వారిని పట్టించుకునే వారున్నారా. ఏమో ఇది అతి పెద్ద డౌటే.