తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి లాజిక్ లు చూస్తుంటే ఒక్కోసారి భలే ఆశ్చర్యం వేస్తుంటుంది. అలాంటి ట్విస్టింగ్ కామెంట్ నే గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ విషయంలో తెరమీదకు తెచ్చారు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నేత - మాజీ మంత్రి ఉమామాధవరెడ్డితో నయీంకు పరిచయాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో రేవంత్ మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణలో ఎంతో గౌరవం కలిగిన కుటుంబాల మీద, తెలంగాణ కోసమే పాటుపడిన వారిమీద బురదచల్లి లాభపడేలా జరిగే పరిణామాలను తాము చూస్తూ ఊరుకోబోమని, ఉమా మాధవరెడ్డి కుటుంబంపై ఈగ వాలినా సహించేదిలేదని రేవంత్ హెచ్చరించారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందని స్పష్టం చేశారు.
నయీం ఎన్ కౌంటర్ పై పోలీసులు ఇస్తున్న అనధికారిక సమాచారం - లీకులు - మీడియా సొంతంగా సేకరించుకుంటున్న విశ్వసనీయ కథనాలు కోకొల్లలుగా వస్తున్నాయని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయకపోవడం సమంజసం కాదని అన్నారు. గతంలో అక్రమాలకు పాల్పడ్డారని డిప్యూటీ సీఎం రాజయ్యను పదవి నుంచి తొలగించిన సీఎం కేసీఆర్ ఆ తరువాత ఆయన చేసిన అక్రమాలు ఏమిటో ఇప్పటివరకూ బయటపెట్టలేదని రేవంత్ గుర్తుచేశారు. అదే రీతిలో నయీం అక్రమాలను వెలికితీసేందుకు అంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని పోలీస్ బృందం చేసే విచారణపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. సిట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదీనంలోనే ఉండటం వల్ల పలు విషయాలు వెలుగులోకి రాకుండాపోయే ప్రమాదముందన్నారు. అందుకే సిట్ ద్వారా చేసే విచారణపై తమకు ఏమాత్రం నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు. సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించి నేరస్తులు ఎవరైనా ఎంతటివారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
సిట్ ద్వారానే విచారణ జరిగితే నయీంకు చెందిన చీకటి లావాదేవీలను మూసి పెట్టే ప్రయత్నం కూడా జరిగే అవకాశముందని రేవంత్ చెప్పారు. గతంలో టీడీపీకి చెందిన ఒక శాసనసభ్యుడి అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆధారాలన్నీ ఏసీబీ అధికారులు సేకరించారని ఏ క్షణమైనా అతన్ని అదుపులోకి తీసుకొనే అవకాశముందని కొన్ని పత్రికలు పతాకశీర్షికలో వార్తలు ప్రచురించాయని అయితే ఆ శాసనసభ్యుడు టీఆర్ఎస్‌లోకి చేరి గులాబి కండువా కప్పుకున్న మరుక్షణం ఆ వార్తలన్నీ మటుమాయమయ్యాయని రేవంత్ గుర్తుచేశారు. అధికార పార్టీ పలురకాలుగా బెదిరించి లొంగదీసుకోవడానికి ఈ విధంగా పత్రికలను కూడా ఉపయోగించుకుంటుందనడానికి ఇదే ఉదాహరణ అని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి శంషాబాద్ ప్రాంతంలో వేల ఎకరాల భూమిని సేకరించాడని ఈ వ్యవహారంలో బాధిత కుటుంబాలు నయీంను ఆశ్రయించడంతో అతను ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిని రూ. 50 కోట్లు ఇవ్వాల్సిందిగా బెదిరించినట్లుకూడా కొన్ని పత్రికలలో కథనాలు వచ్చాయని రేవంత్ తెలిపారు. నయీం ఎన్ కౌంటర్ తరువాత బయటపడిన డైరీలు, డాక్యూమెంట్లలో ఇలాంటి విషయాలకు సంబంధించిన సమాచారం ఉన్నా దానిని ప్రభుత్వం బయటపెట్టకుండా తొక్కిపెట్టే నయీంకు సంబంధించిన వ్యాపారాలు, ఆస్తులు ఇతర రాష్ట్రాలలో కూడా ఉండటం ఆయన చీకటి వ్యాపారంలో రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల వివరాలు బయటపెట్టాలన్నారు.