శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకోవటం.. తొమ్మిది మంది మరణించటం తెలిసిందే. ఈ ఘటనతో రెండు రాష్ట్రాల్లోని తెలుగువారు షాక్ కు గురయ్యారు. ఇప్పటివరకు శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకున్నది లేదు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. మాజీ ఎంపీ మల్లు రవిలు బాధితుల్ని పరామర్శించేందుకు బయలుదేరారు.
వీరుప్రయాణించే వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు.ఇక్కడ అర్థం కానిది.. ఒక విపక్ష ఎంపీ.. బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించటం తప్పేమిటి? ఆ మాటకు వస్తే.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. బాధితుల ఇంటికి వెళ్లి పలుకరించి వచ్చారు కదా? అదే రీతిలో రేవంత్.. మల్లు రవిల పర్యటనను పోలీసులు ఎందుకు చూడటం లేదు? అన్నది క్వశ్చన్. ఉప్పునూతల మండలం లత్తీపూర్ పెట్రోల్ బంకు వద్ద రేవంత్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల తీరును తప్పు పట్టారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అరెస్టు చేయాల్సింది తనను కాదని.. ఈ ఘటనకు బాధ్యులైన మంత్రి జగదీశ్ రెడ్డి.. జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావులను అని పేర్కొన్నారు. జరిగిన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలన్న ఆయన.. ఈ ప్రమాదంలో మరణించిన ఒక్కోబాధిత కుటుంబానికి కోటి రూపాయిల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు.
ప్రమాదం జరిగిన శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించేందుకు అనుమతి మంజూరు చేయాలన్న రేవంత్.. బాధిత కుటుంబాల్ని పరామర్శించటం ప్రతిపక్షాల బాధ్యత అని చెప్పారు. రేవంత్ ను అరెస్టు చేసిన వైనంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అన్నాక.. ఘటనాస్థలాన్ని పరిశీలించటం.. బాధితుల్ని పరామర్శించటం లాంటివి కనీస బాధ్యతలని.. అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
నిజమే.. బాధితుల్ని పరామర్శించటం తప్పెలా అవుతుంది? రాజకీయమే చేస్తారనుకుందాం? మరి.. విపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ అండ్ టీం చేసింది కూడా అదే కదా? ఇలాంటి తీరు ఇప్పటికి బాగానే ఉన్నా.. రేపొద్దున విపక్షంలో ఉన్నప్పుడు.. ఇలాంటి వాటిని ఎదుర్కొనాల్సి రావటం గులాబీ శ్రేణులకు కష్టమవుతుందన్న విషయాన్ని కేసీఆర్ ఎందుకు మిస్ అవుతున్నట్లు..?