తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కమ్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఆయనకు రిమాండ్ విధిస్తూ కోర్టు పేర్కొనటంతో ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఇటీవల కేటీఆర్ కట్టుకున్నారంటూ నార్సింగ్ పరిధిలోని ఒక ఫామ్ హౌస్ ఎదుట ఆందోళన నిర్వహించటం ఒక ఎత్తు అయితే.. ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగురవేయటంపై ఆయనతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు కావటం తెలిసిందే.ఈ కేసులో ఏ1గా ఉన్నారు రేవంత్. మిగిలిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి నేరుగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన రేవంత్.. పోలీసులతో చర్చలు జరిపారు. చివరకు ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. రేవంత్ తాజా జైలు ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అప్పట్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసులో తొలుత చంచలగూడ జైలుకు రేవంత్ ను తరలించినప్పటికీ.. తర్వాత కాలంలో చర్లపల్లికి షిఫ్ట్ చేశారు.
తాజా కేసుకు సంబంధించి కోర్టు రిమాండ్ విధించటంతో ఆయన.. చర్లపల్లి జైలుకు తరలించారు. ఎంపీగా ఉన్న ఆయనకు భద్రతను కల్పించేందుకు వీలుగా వీవీఐ బ్యారెక్ ను కేటాయించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న వేళ ఆయన్ను గంగా బ్యారెక్ లోనే ఉంచారు. తాజా ఉదంతంలోనూ ఆయన్ను అదే బ్యారెక్ లో ఉంచటం గమనార్హం. రెండు వేర్వేరు కేసుల్లో అరెస్టు సందర్భంగా ఒకే బ్యారెక్ లో ఉండటం చూసినప్పుడు.. జైలు ఎపిసోడ్ లో రేవంత్ కు సేమ్ సీన్ రిపీట్ అయ్యిందని చెప్పక తప్పదు.