ఓటుకు నోటు కేసులో కెమేరా సాక్షిగా బుక్ అయి.. నెలరోజులు జైలులో ఉండి.. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌తో ప్రస్తుతం తన నియోజకవర్గమైన కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఉండటం తెలిసిందే. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన అనంతరం ర్యాలీగా ఇంటికి వెళుతున్న సందర్భంలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన మంత్రులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటం తెలిసిందే.
తిట్లనే మాటలుగా చేసుకొని మాట్లాడిన ఆయనపై తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జైలు నుంచి విడుదలైన ఆయన తన నియోజకవర్గానికి వెళ్లిన రేవంత్ అప్పటి నుంచి కామ్‌గా ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉండే తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్ని చూసే మీడియా ప్రతినిధులను కొడంగల్‌కు ఆహ్వానించారు. తన నియోజకవర్గంలో నిర్వహించే మీడియా సమావేశానికి హాజరు కావాలంటూ హైదరాబాద్ మీడియాను ప్రత్యేకంగా పిలిపించటం ఆసక్తి రేపుతోంది.
మీడియా ప్రతినిధులు కొడంగల్‌లో కూడా ఉంటారు. అయినా.. వారిని కాదని..హైదరాబాద్ నుంచి బీట్ రిపోర్టర్లను పిలిపించుకోవటం ఎందుకన్నది ఒక ప్రశ్న అయితే.. ఈ మీడియా సమావేశంలో ఆసక్తికరమైన విషయాలేమైనా చెబుతారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.