తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన మేనల్లుడు కమ్ తెలంగాణ మంత్రి హరీశ్ రావులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం విప్పిన విపక్షాలు ఇప్పటికే కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న వేళ.. రేవంత్ రెడ్డి ఈ అంశంపై వ్యతిరేకంగా దీక్ష చేయటానికి గజ్వేల్ నియోజకవర్గానికి వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. మంత్రులపై విరుచుకుపడ్డారు. పేదల కడుపు కొట్టి.. జేబులు నింపుకోవటానికే మల్లన్నసాగర్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన మామా.. అల్లుళ్లు ఆంధ్రా కాంట్రాక్టర్లతో అక్రమ సంపాదనకు పాల్పడుతున్నట్లుగా దుయ్యబట్టారు. ప్రాజెక్ట్ నిర్మానానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నా.. మంత్రి హరీశ్ మాత్రం అక్కడి రైతుల్ని బెదిరించటాన్ని ఆయన తప్పు పట్టారు.
ఉద్యమాలు ఒకరు చేశారు.. ఆత్మహత్యలు ఒకరు చేసుకున్నారు.. కానీ అధికారం మాత్రం మరొకరు అనుభవిస్తున్నారంటూ మండిపడిన రేవంత్ రెడ్డి.. ‘‘కేసీఆర్.. హరీశ్ లోపలకు వైఎస్ ఆత్మ దూరినట్లుంది. అందుకే ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చు అమాంతం పెరుగుతోంది. అమాయక రైతులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. నిర్వాసితుల్ని భిక్షగాళ్లుగా మారుస్తున్న తెలంగాణ సర్కారు తీరును చూస్తూ ఊరుకోవటం. ఈ ప్రాజెక్టు ద్వారా నాలుగు వేల గ్రామాల్ని కదిలించనున్నట్లగా హరీశ్ చెబుతున్నారు. ఆయన శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. రోజురోజుకి పెరుగుతున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు వ్యతిరేకతలతకు తగ్గట్లే రేవంత్ మాటల జోరు ఉండటం గమనార్హం.