మోడీపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. భావసారూప్య పార్టీలతో జత కట్టేందుకు వీలుగా ఆదివారం మహారాష్ట్రకు వెళ్లటం అక్కడి అధికారపక్షమైన శివసేన.. దాని భాగస్వామి అయిన ఎన్సీపీ అధినేతలతో భేటీ కావటం తెలిసిందే. మహారాష్ట్రలోని ప్రభుత్వంలో శివసేన.. ఎన్సీపీ.. కాంగ్రెస్ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ పై తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. కేసీఆర్ ఇటీవల ప్రస్తావించిన రఫేల్ స్కాంకు సంబంధించిన కుంభకోణానికి సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్రం మీదా.. బీజేపీ మీదా యుద్ధం ప్రకటించినట్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని.. రాఫెల్ నుంచి మొదలు పెట్టుకుంటే కేంద్ర మంత్రుల అవినీతి ఆక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఉప ఎన్నికల వేళలోనూ.. మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ నేతలు కేసీఆర్ అవినీతి మీద మాట్లాడారని.. త్వరలోనే కేసీఆర్ కుటుంబం జైల్లో ఉంటుందన్నారని గుర్తు చేశారు. అదే సమయంలో బీజేపీ మీదా టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారని.. ఇరువురు ఒకరిపై ఒకరు విభేదాలు ఉన్నట్లుగా జనాలకు చెప్పే ప్రయత్నం చేసిందన్నారు.కేసీఆర్ ముంబయి పర్యటన మొత్తం ఒక డ్రామాగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. ఉప్పు.. నిప్పులా ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశారని.. అయితే.. వీరిద్దరూ కలిసి సింగరేణి గనుల్ని కొల్లగొట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
‘‘సింగరేణి సంస్థ లో 51 శాతం రాష్ట్ర వాటా, 49 శాతం కేంద్రం వాటా వుంది. 50 వేల మంది గని కార్మికులకు ఉద్యోగులకు అండగా ఉంటుంది సింగరేణి సంస్థ. కరెంట్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. సింగరేణి గనులను ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అమ్మడానికి ముందుకొస్తే.. రాష్ట్ర సర్కార్ అడ్డుకోడానికి ముందుకు రాలే. అత్యంత నాణ్యమైన బొగ్గు మన వద్ద వుంది. సాంకేతిక అవసరం లేకుండా బొగ్గు తీయవచ్చు. సింగరేణి 25 ఏళ్ళు లీజ్ ఇవ్వడానికి కేసీఆర్ తన అధికారాన్ని వినియోగించి ప్రైవేట్ పరం చేసే కుట్ర చేశారు. ఒరిస్సా లోని నైనా బొగ్గు గనిని లీజ్ ఇవ్వడం జరిగింది. ఐఏఎస్ శ్రీధర్ .. సింగరేణి సంస్థకు సీఎండి గా ఉన్నారు. నిబంధనలకు విరుద్దంగా శ్రీధర్ కొనసాగుతున్నారు. 7 ఏళ్లుగా ఛైర్మెన్, సీఎండీ గా కొనసాగుతున్నారు. వేలాది కోట్ల రూపాయల అవినీతికి జరుగుతుంది. ఎంతో మంది ఐఏఎస్ లున్నా నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్ కొనసాగడమేంటి? శ్రీధర్ పై ఎన్నో ఆరోపణలు వచ్చిన కేసీఆర్ తొలగించలేదు. చివరకు కోల్ ఇండియా కూడా వద్దని చెప్పిన కేసీఆర్ వినలేదు’’ అని పేర్కొన్నారు.
ఈ స్కాం గురించి మరిన్ని వివరాలు వెల్లడించిన రేవంత్.. ‘‘ఒరిస్సా లోని నైని కోల్ మైన్ 25 ఏళ్లు ప్రైవేట్ సంస్థకు లీజ్ ఇచ్చారు. దీని ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వొచ్చు. కోల్ ఇండియా నిబంధనలను కాలరాసి ఒకరిద్దరి వ్యక్తులకు లబ్ది చేకూరే పని చేసిండు. టెండర్ ఎవరికీ రాకుండా చేసే కుట్ర. ఇది రాఫెల్ కుంభకోణం కంటే పెద్దది. రాఫెల్ రూ.35 వేల కోట్లు ఐతే.. ఇది రూ.50 వేల కోట్ల స్కాం’’ అని పేర్కొన్నారు. తాను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి దీనిపై కేంద్రానికి ప్రధానికి.. హోం.. విజిలెన్స్.. కోల్ మినిస్టర .. కోల్ సెక్రెటరీ వరకు ఫిర్యాదు చేశాం. శ్రీధర్ పైనా కంప్లైంట్ చేశాం. కానీ చర్యలు తీసుకోవటం లేదు’’ అని మండిపడ్డారు.
ఈ ఉదంతంలో కేంద్ర మైనింగ్ మినిస్టర్ ప్రహ్లద్ జోషి కూడా ఏమి చేయలేమని చెప్పారని.. ఈ ఇష్యూను పీఎంవో కార్యాలయం చూస్తుందని చెప్పారన్నారు. దీంతో.. ఈ ఇష్యూను సెంట్రల్ విజిలెన్సు కమిషన్ కు రిఫర్ చేయమంటే.. ప్రహల్లాద్ చేతులెత్తేశారు’’ అని రేవంత్ చెప్పారు. ఇదే అంశంపై ఐఏఎస్ అధికారి శ్రీధర్ కు ఫోన్ చేసి తప్పు చేస్తున్నావ్ అని చెప్పినట్లు రేవంత్ చెప్పారు. దీనికి ఆయన నిస్సహాయకత వ్యక్తం చేశారన్నారు. ‘‘ఆదానికి టెండర్ దక్కితే.. ఆయన ఎవరికైనా ఆర్ధిక పెట్టుబడి దారికి అవకాశం కల్పించవచ్చు. అదానీ మోడీ మనిషి ఐతే.. ప్రతిమ శ్రీనివాస్ కేసీఆర్ బినామీ రూపంలో నైని సంస్థల్లోకి ఎంట్రీ కాబోతున్నారు. సౌర విద్యుత్ కొనాలని మోడీ అంటుండు అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు నైని కోల్ మైన్ ఎట్లా ఆదానికి కట్టబెడుతున్నావ్?’’ అని ప్రశ్నించారు.
మొత్తం భూగర్భ గనులను కేసీఆర్ కుటుంబం దోచుకునే పని చేస్తుందన్న రేవంత్ రెడ్డి.. ‘‘మోడీ, అమిత్ షా ఎందుకు కేసీఆర్ అవినీతిపై ముందుకు రావడం లేదు?’’ అని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ లో డీజీపీపై చర్య తీసుకున్న కేంద్రం.. శ్రీధర్ పైన ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? శ్రీధర్ పై తీవ్ర ఆర్ధిక ఆరోపణలు వున్నా ఎందుకు బిజెపి నాయకులు మాట్లాడటం లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సుపారీ గ్యాంగ్ లీడర్ కేసీఆర్ గా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కేసీఆర్.. చీటర్, లయర్ అండ్ లూటర్. జగన్, కేజ్రీవాల్, ఇతర నేతలను ఎందుకు కలవడం లేదు? బొగ్గు తవ్వకాల్లో డీజిల్ కొనుగోలులో సీఎస్ఆర్ నిధుల వినియోగం పై విచారణ చేపట్టాలి.అప్పుడే సింగరేణి శ్రీధర్ అవినీతి బయటపడుతుందన్న రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.