వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్ష బరిలోకి దిగుతానంటూ ప్రకటించేసిన టాలీవుడ్ పవర్ స్టార్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్... ప్రస్తుతం తెలంగానలో ఛలోరే ఛలోరే ఛల్ పేరిట యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. యాత్ర ప్రారంభం నుంచి యాత్ర కొనసాగుతున్నంత మేర టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతున్న పవన్... విపక్షం కాంగ్రెస్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా గతంలో తనను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - మాజీ ఎంపీ వి. హన్మంతరావుపై ఆయన తనదైన శైలి కామెంట్లు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా వీహెచ్‌ను ప్రకటిస్తే... తాను వీహెచ్ తో కలిసి ఇంటింటికీ తిరుగుతానని - వీహెచ్ కు ఆ దమ్ము ఉందా? అన్న రీతిలో పవన్ సెటైరిక్ విమర్శలు చేశారు. వీటిపై వీహెచ్ కూడా కాస్తంత ఘాటుగానే స్పందించినా... ఇప్పుడు ఇటీవలే టీ టీడీపీకి రాంరాం పలికేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన యువ రాజకీయవేత్త రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిపోయారు.
తమ పార్టీ టికెట్లపై విజయం సాధించి టీఆర్ఎస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ కు ఫిర్యాదు చేసేందుకంటూ బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి... ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజ్ భవన్ వద్దే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పై నిప్పులు చెరుగుతూనే... వీహెచ్ పై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన రేవంత్ రెడ్డి... జనసేన అధినేతపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు అన్ని రాజకీయ పార్టీలు - ఆ పార్టీల్లో ఉన్న సీనియర్ నేతలపై తనదైన శైలి విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్ ముందుగా తన స్థాయి ఏమిటో తెలుసుకోవాలని రూడా రేవంత్ రెడ్డి కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారని చెప్పాలి. అసలు పవన్ కల్యాణ్ ఇప్పుడే తెలంగాణలో యాత్ర పేరిట ఎందుకు బయటకు వచ్చారన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న టీఆర్ ఎస్... ఎలాగైనా గెలవాలన్న కాంక్షతోనే తనకు మద్దతుగా పవన్ ను రంగంలోకి దించిందని ఆయన ఆరోపించారు. క్రమంగా బలపడుతున్న విపక్షాలను బలహీనపరచడంతో పాటుగా విపక్షాల కోటాలోకి వెళ్లిన ఓట్లను చీల్చేందుకే కేసీఆర్... పవన్ ను బరిలోకి దించారని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఈ విషయం అర్థమైనా కూడా పవన్ యాత్ర పేరిట ప్రజల్లోకి వచ్చారంటే ఆయన స్థాయి ఏపాటిదో ఇట్టే అర్థం కాక మానదన్న వ్యాఖ్య కూడా రేవంత్ నోట వినిపించింది. తమ పార్టీ నేత వి హనుమంత రావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తాను మద్దతిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయాన్ని పవన్ నేరుగా తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి చెప్పాలన్నారు. ఇందుకు పవన్ సంసిద్ధతను వ్యక్తం చేస్తే తానే స్వయంగా పవన్‌ను రాహుల్ వద్దకు తీసుకు వెళ్తానని ఆయన చెప్పారు. అయినా పవన్ కళ్యాణ్ తన స్థాయికి తగినట్లుగా మాట్లాడటం లేదని రేవంత్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై పవన్ పదేపదే ప్రశంసలు కురిపించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యూహంలో పవన్ పావు కావొద్దని హితవు పలికారు. మొత్తంగా పవన్ చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకునే రేవంత్ రెడ్డి ఆయనపై తనదైన శైలిలో ఎదురు దాడికి దిగారు. మరి రేవంత్ వ్యాఖ్యలకు పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.