కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మౌనం వీడారు. కాంగ్రెస్‌లో చేరింది మొదలు మీడియాతో మాట్లాడటం నిలిపివేసిన రేవంత్..తన జర్నీ ఏంటి? దక్కబోయే పదవి ఎలా ఉంటుంది? పోరాట పంథా ఎలా ఉంటుందనే విషయంలో అస్పష్టతలో ఉంచారు. ఈ నేపథ్యంలో రకరకాల చర్చోపచర్చలు సాగాయి. తాజాగా రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్రత్యర్థి అయిన కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో తన ఫీల్డ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.
డిసెంబర్ 9 నుండి ఫీల్డ్ మీదకి వస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. డ్రగ్స్ కేస్ లో ప్రభుత్వం బాగా హడావిడి చేయడంతో మధ్య తరగతి ప్రజలు సంతోషపడ్డారని అయితే అది ఆచరణలో వైఫల్యం చెందిందని అన్నారు. మాదాపూర్-జూబ్లీహిల్స్- బంజారాహిల్స్ లో పబ్ లు ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే పబ్స్ ఉండేవని,బయట మరో రెండు పబ్‌లు ఉండేవని పేర్కొంటూ...తెలంగాణ వచ్చిన తర్వాత 59 పబ్‌లు ఏర్పాటు అయ్యాయని ఆరోపించారు. తెలంగాణా వచ్చినాక డ్రగ్స్, పబ్స్ మాత్రమే పెరిగాయని ఆయన ఆరోపించారు. డ్రగస్ సరఫరాదారులు .. మాత్రం కేసీఆర్ కుటుంబానికి దగ్గర వ్యక్తులని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. ఈవెంట్ నౌ అనే సంస్థకు కూడా సంబంధం ఉందని తెలిపారు.
సన్ బర్న్ పార్టీలను అదుపు చెయ్యలేక గోవా ప్రభుత్వమే రద్దు చేసిందని రేవంత్ వివరించారు. ఈ తరహా పార్టీలలో మాదక ద్రవ్యాల వాడకం ఎక్కువగా ఉంటుందని, మహిళల మీద దాడులు జరుగుతాయని అందుకే కర్ణాటక, మహారాష్ట్ర కూడా అనుమతులు ఇచ్చి రద్దు చేసిందని రేవంత్ తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత సన్ బర్న్ పార్టీలకు క్రీడా మైదానాలు ఇస్తున్నారని ఆరోపించారు. హైటెక్స్‌లో - గచ్చిబౌలి స్టేడియంలో అనుమతి ఇచ్చారని ఆరోపించారు. వీటికి టికెట్స్ అమ్మింది ఈవెంట్స్ నౌ అని పేర్కొంటూ...అది పాకాల రాజేంద్ర ప్రసాద్ సంస్థ అని తెలిపారు. ఆయన మంత్రి కేటీఆర్ సొంత బామ్మర్ది అని పేర్కొంటూ అందుకే డ్రగ్స్ కేస్ మూత పడిందని రేవంత్ ఆరోపించారు..
కాంగ్రెస్ ,టీడీపీ హయంలో వచ్చిన సంస్థలు ఎప్పుడూ నైట్ లైఫ్ అడగలేదని...కేవలం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఇది జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. మాదక ద్రవ్యాల్లో ఎవరు లబ్ధిదారులని ఆయన ప్రశ్నించారు. నవంబర్ 24 సాయంత్రం 5 గంటల నుండి గచ్చిబౌలి క్రీడా స్టేడియంలో సన్ బర్న్ పార్టీ కి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఢిల్లీ లో సన్ బర్న్ పార్టీ అనుమతి రద్దు చేసిందని, పూణే లో రద్దు కోసం పోరాటం జరుగుతోందని తెలిపారు. డ్రగ్స్ దందా ఎన్ని కోట్ల వ్యాపారం.. ఎవరు లబ్ధిదారులు అని రేవంత్ ప్రశ్నించారు. ఆగస్టు 24న గోవాలో ఓవర్ డోస్ డ్రగ్స్ తో ఇద్దరు చనిపోయారు కాబట్టి సన్ బర్న్ రద్దు చేస్తున్నట్టు గోవా సీఎం ప్రకటించారని రేవంత్ తెలిపారు. పబ్ లు, మ్యూజికల్ నైట్స్ అడ్డాగా మారుతున్నాయని విచారణలో తేలిన తర్వాత ఎందుకు ఇంకా కొనసాగుతున్నాయని రేవంత్ ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడితో అనుమతులు లభించాయని నిలదీశారు. పోలీస్ రక్షణ కూడా ఈ ప్రోగ్రాం కు ఏర్పాటు చేశారని పేర్కొంటూ ఇదేనా విశ్వ నగరం అంటే అని నిలదీశారు. 15 సంవత్సరాల పిల్లలకు కూడా అనుమతి ఉందని పార్టీ నిర్వాహకులు ప్రకటించినప్పటికీ...ప్రభుత్వం ఎందుకు మిన్నకుందని ఆయన ప్రశ్నించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే, నిర్వాహకుల మీద ఎందుకు కేస్ పెట్టలేదని రేవంత్ ప్రశ్నించారు. కొలువుల కొట్లాట కు అనుమతి ఇవ్వరు కానీ మాదక ద్రవ్యాల వినియోగించే పార్టీల కు అనుమతి ఇస్తారా అని నిలదీస్తారా అని ప్రశ్నించారు. రోడ్ నంబర్ 36లో హై లైఫ్ పబ్ ఉదయం 5 వరకు నిర్వహిస్తున్నారని ఈ ఒక్క పబ్ నడపడానికి అన్ని పబ్ లు మూసేస్తున్నారని ప్రశ్నించారు. హై లైఫ్ పబ్ లోకి వచ్చే వారి కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా గంట సేపు అపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే .. పాకాల రాజేంద్రప్రసాద్ తో పాటు అందరినీ విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. సన్ బర్న్ పార్టీకి గత సంవత్సరం కేటీఆర్ హాజరు అయ్యారని..ఆయన హాజరు అయ్యారో లేదో..ఆయన్నే చెప్పాలని డిమాండ్ చేశారు.