రేవంత్ ఇలాంటి చాలెంజ్ కూడా చేస్తారా?

Update: 2017-12-23 13:51 GMT
టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌ లో చేరిన రేవంత్ రెడ్డి మాట‌కారిత‌నం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న మాట తీరే ఆయ‌న బ‌లం. అయితే రేవంత్ తీరు శ్రుతి మించుతున్న‌ట్లు ఉంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై ఒంటికాలిపై లేచే లేవంత్ అనంత‌రం ఆయ‌న పార్టీపై కూడా అదే రీతిలో స్పందించారు. అయితే కేసీఆర్‌ కుటుంబ స‌భ్యుల‌పై రేవంత్ చేసిన విమ‌ర్శ‌లను ప‌లువురు స‌హ‌జంగానే అంగీక‌రించ‌లేదు. ఇటీవ‌ల మంత్రి హ‌రీశ్ రావు భార్య‌ - కూతురుపై కూడా ఆయ‌న ఆరోపణ‌లు చేశారు.

దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్ అదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. చంచల్‌గూడ‌ జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ నేత‌ మందకృష్ణను పరామర్శించిన అనంత‌రం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఇటీవ‌ల జడ్చ‌ర్ల‌లో జ‌రిగిన జ‌న‌గ‌ర్జ‌న‌లో ప‌లు కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై మంత్రి ల‌క్ష్మారెడ్డి ఘాటుగా రియాక్ట‌య్యారు. దీన్ని త‌ప్పుప‌ట్టిన రేవంత్ అదే కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం. లక్ష్మారెడ్డి భాష మార్చుకోకపోతే తోలు తీస్తాన‌ని - కేసీఆర్ బూట్లు నాకే లక్ష్మారెడ్డి నాపై మాట్లాడతాడా అని ప్ర‌శ్నించారు. `నేను అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పకుండా ..అరే ఒరే అంటావా ..?` అని ప్ర‌శ్నించిన రేవంత్ క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. `బోసిడికే లక్ష్మారెడ్డి..న‌న్ను ఒరే..అరే అంటావా..నువ్వు సన్నాసివి. తిట్ల పోటీ పెట్టుకుంటానంటే నీఇష్టం ..నేను రెడీ.లక్ష్మారెడ్డి మర్యాదగా మాట్లాడు...కేసీఆర్ బూట్లు నాకిన చరిత్ర నీది` అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

మంత్రి లక్ష్మారెడ్డి చీకటి వ్యవహారాల‌ను వివరాలతో స‌హా బయట పెడతాన‌ని రేవంత్ ప్ర‌క‌టించారు. `నా ఉరికి రా..మేమేందో మా ఆస్తులేంటో తెలుస్తుంది. నీ బతుకు నాకు తెలుసు లక్ష్మారెడ్డి. నేను ఎకరాల్లో చేస్తున్నప్పుడు నువ్వు...రియల్ ఎస్టేట్ బ్రోకర్ వీ.నీ బినామీల బతుకు చరిత్రను త్వరలో బయట పెడ‌తాను.  డాక్టర్ సర్టిఫికెట్ నిజామా లక్ష్మారెడ్డి అని అడిగితే విమ‌ర్శ‌లు చేస్తావా? వంద పడకల ఆసుపత్రి తేకుండా కేసీఆర్‌కు గులాంగిరి చేస్తున్నావు` అని ఆరోపించారు.

ఎస్సీ వర్గీకరణ కోసం పనిచేస్తున్న మందకృష్ణను ప్రభుత్వం వేధిస్తోంద‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వర్గీకరణపై అఖిలపక్షం తీసుకు వెళ్లేందుకు సిద్ధ‌మ‌న్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఆ ప‌నిచేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణలో అరాచక పాలన సాగుతోంద‌ని ఆరోపించారు. మాదిగలపై అక్రమ కేసులు పెడుతున్నారని...మాదిగలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు.
Tags:    

Similar News